విచిత్రం : కోళ్లు గుడ్లు పెట్టడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు.. !!

First Published Apr 21, 2021, 12:03 PM IST

మహారాష్ట్ర పోలీసులకు ఓ వింత ఫిర్యాదు అందింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక.. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి కేసు వినక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఆ కేసు ఏంటంటే.. కోళ్లు గుడ్లు పెట్టడం లేదంటూ పౌల్ట్రీ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

undefined
కోళ్లు గుడ్లు పెట్టకపోతే పోలీసులేం చేస్తారు? అనే కదా మీ అనుమానం.. అయితే ఈ కేసులో ఓ తిరకాసు ఉంది. అంతకుముందు వరకు బాగానే గుడ్లు పెట్టిన కోళ్లు ఓ కంపెనీ తయారు చేసిన ఆహారం తిన్న తరువాతి నుంచి గుడ్లు పెట్టడం మానేశాయి.
undefined
మొదట్లో యజమానులకు విషయం అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతుందా అని నిఘా వేస్తే... సదరు కంపెనీ ఆహారం వేయడం మొదలు పెట్టిన తరువాతే గుడ్ల ఉత్పత్తి తగ్గిందని తేలింది. దీంతో పోలీసులకు ఆ కంపెనీ మీద ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కోళ్ల దాణాను సప్లయ్ చేసిన సంస్థ మరో మూడు, నాలుగు ఫౌల్ట్రీ ఫారాలకు కూడా దాణా సప్లయ్ చేసింది. ఆయా ఫౌల్ట్రీ ఫారాల్లో కూడా ఇలాంటి సమస్య తలెత్తిందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా లాల్ భోర్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర మోక్షీ మాట్లాడుతూ.. తమ వద్దకు నలుగురు ఫౌల్ట్రీ యజమానులు, తమ కోళ్లు దాణా తిన్న తరువాత నుంచి గుడ్లు పెట్టడం మానేశాయని ఫిర్యాదుతో వచ్చారన్నారు.

దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదు దారు తెలిపిన వివరాల ప్రకారం అహ్మాద్ నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, దానిని కోళ్లకు వేసినప్పటినుంచి ఒక్క గుడ్డు కూడా పెట్టడం లేదని వాపోయారు.
undefined
కాగా ఈ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు సదరు కంపెనీ ప్రతినిధులను విచారిస్తున్నారు. అలాగే ఈ విషయం మీద పశువైద్య అధికారులను అడిగి మరిని వివరాలు తెలుసుకుంటున్నారు.
undefined
click me!