PMR Bal Puraskar winners: 2019లో ఈ అవార్డులో ఏం మార్పులు వచ్చాయి, ఇప్పుడు పిల్లలకు ఎలాంటి గౌరవం లభిస్తుంది?

First Published Jan 24, 2022, 10:45 PM IST

ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు గ్రహీతలతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM narendra modi) నేడు సోమవారం సంభాషించారు. 'నేషనల్ గర్ల్ చైల్డ్ డే' అండ్ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ప్రధానమంత్రి అవార్డు గెలుచుకున్న పిల్లలతో వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే ఈ జాతీయ బాలల అవార్డుకు మొత్తం 29 మంది చిన్నారులు ఎంపికయ్యారు.  ప్రతి సంవత్సరం ఈ బాలల అవార్డులు అందుకోవడానికి  విజేతలు ఢిల్లీకి వచ్చి  అలాగే రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటారు. కానీ ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అలా జరగలేదు  ఈ సంవత్సరం విజేతలకు 'బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ' ద్వారా డిజిటల్ సర్టిఫికేట్‌లను అందించారు. గత ఏడాది 'ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు 2020'కి 49 మంది పిల్లలు ఎంపికయ్యారు.  

2019లో గణనీయమైన మార్పులు
 ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ధైర్య సహస పిల్లలకు అందించేవారు. కానీ 2019లో కేంద్ర ప్రభుత్వం దీనికి కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం ప్రారంభించింది, అంటే ధైర్యవంతులైన పిల్లలకు మాత్రమే కాకుండా ఆవిష్కరణలు, సామాజిక సేవ, విద్య, కళ ఇంకా సంస్కృతి అలాగే క్రీడలలో బాగా రాణిస్తున్న పిల్లలకు కూడా అందిస్తున్నారు.

మార్పుకి కారణం ఏమిటి?
నిజానికి, ప్రతి సంవత్సరం గ్యాలంట్రీ అవార్డు(Gallantry awards)ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ ద్వారా ఎంపిక చేసిన పిల్లలను మాత్రమే వుమెన్ అండ్ చైల్డ్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించి అవార్డులను అందించింది. కానీ ఈ సంస్థపై ఆర్థిక అవకతవకలు ఆరోపణలు వచ్చాయి  దీంతో దినిపై ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఆ తర్వాత మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ సంస్థకు దూరమైంది.  

కౌన్సిల్ పాత్ర ఏమిటి? 
1957 సంవత్సరం నుండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ దేశవ్యాప్తంగా సాహసం చేసిన బాలల పేర్లను ఎంపిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం, అందులో కేంద్ర ప్రభుత్వం సహకారం కొనసాగించడం జరిగింది. ప్రభుత్వం తరపున గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముందు రాష్ట్రపతి ఇంకా ప్రధానమంత్రిని కలిసే అవకాశం పిల్లలకు  ఇచ్చేవారు.

అవార్డు గెలుచుకున్న పిల్లల చదువు, శిక్షణ తదితర ఖర్చులన్నీ కౌన్సిల్ భరిస్తుంటుంది. 1996 నుండి దేశంలోని ప్రతి ప్రధానమంత్రి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాధించిన 5-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలను సత్కరిస్తున్నారు. పతకంతో పాటు సర్టిఫికెట్, ప్రశంసా పత్రం, నగదు పురస్కారం కూడా అందుకుంటారు.

కౌన్సిల్ ఏం చెప్పింది?  
కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు దూరమైన తర్వాత కౌన్సిల్ తన స్థాయిలో 21 మంది పిల్లలకు జాతీయ శౌర్య పురస్కారం 2018ని ప్రకటించింది. న్యాయస్థానంలో ఆర్థిక అవకతవకల కేసు కారణంగా జాతీయ శౌర్య పురస్కారం 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నదని, అయితే ఈ అవార్డును ధైర్యవంతులైన పిల్లలకు అందజేస్తూనే ఉంటామని కౌన్సిల్ అధ్యక్షురాలు గీతా సిద్ధార్థ్ తెలిపారు. ఈ మండలి ధైర్యసాహసాల పిల్లలకు మాత్రమే అవార్డులు ఇచ్చేదన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పిల్లలందరూ ధైర్య సాహసలకి ఎంపికైనవారు కాదు.

click me!