ఫొటోలు: బెంగాల్‌లో రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి.. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు

First Published Jan 14, 2022, 2:24 AM IST

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సుమారు 40 మంది గాయపడ్డారు. ఇందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో మృతి చెందినవారికి రూ. 5 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 1 లక్ష, స్వల్ప గాయాలు అయినవారికి రూ. 25వేల పరిహారాన్నికేంద్రం ప్రకటించింది. రైలు ప్రమాదానికి గల కారణాలను కనుక్కోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉదయం ప్రమాద స్థలికి చేరుకుని పర్యవేక్షించనున్నారు.
 
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రాజస్తాన్‌లోని బికనీర్ నుంచి బయల్దేరిన ఎక్స్‌ప్రెస్ బిహార్‌లోని పాట్నా మీదుగా అసోంలోని గువహతికి చేరాల్సింది. కానీ, బికనీర్ నుంచి బయల్దేరి పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా చేరగానే పట్టాలు తప్పింది. గురువారం సాయంత్రం సుమారు 4.53 గంటల ప్రాంతంలో న్యూ జల్‌పైగురి స్టేషన్‌కు 42 కిలోమీటర్ల దూరంలో న్యూ దోమోహని స్టేషన్, న్యూ మైనగురి స్టేషన్‌ల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బికనీర్-గువహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి.
 
ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. సుమారు 40 మంది గాయపడ్డారు. ఇందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 50 మంది ప్రయాణికులను క్షేమంగా కాపాడగలిగారు. క్షతగాత్రులను జల్‌‌పైగురి, మైనగురిలోని హాస్పిటళ్లకు చికిత్స కోసం తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వాటిని తెలుసుకోవడానికి ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. 

train derail in west bengal

train derail in west bengalకేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తిగతంగా ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇక్కడి పరిస్థితులను వివరించారు.

train derail in west bengal

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 1 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను, స్వల్ప గాయాలపాలైన వారికి రూ. 25వేలు అందజేయనుంది.

కేంద్ర రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు బయల్దేరారు. అర్ధరాత్రే ఆయన కోల్‌కతా చేరుకున్నారు. మైనగురికి రాత్రి 2 గంటల ప్రాంతంలో చేరుకునే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఉదయమే ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

train derail in west bengal

రెస్క్యూ ఆపరేషన్స్‌లోకి మూడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. స్థానికులు సహా తోటి ప్రయాణికులు సహాయక చర్యల్లో చేపడుతున్నారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పాట్‌కు చేరడానికి ఢిల్లీ నుంచి బయల్దేరారు.

click me!