Republic Day: 17 జాగ్వర్ యుద్ధ విమానాలతో ‘75’ ఆకారం.. రాజ్‌పథ్‌లో 75 విమానాల విన్యాసాలు

Published : Jan 17, 2022, 04:24 PM ISTUpdated : Jan 20, 2022, 04:09 AM IST

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలు జనవరి 23వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ఏడాది సుమారు 75 యుద్ధ విమానాలు విన్యాసాలు చేయనుంది. 17 జాగ్వర్ యుద్ధ విమానాలు 75 ఆకారాన్ని ఆకాశంలో ఆవృతం చేయనున్నాయి. ఈ జాగ్వర్ యుద్ధ విమానాల మూలాలు బ్రిటీష్‌కు చెందినవే.

PREV
15
Republic Day: 17 జాగ్వర్ యుద్ధ విమానాలతో ‘75’ ఆకారం.. రాజ్‌పథ్‌లో 75 విమానాల విన్యాసాలు

 ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో సుమారు 75 యుద్ధ విమానాలతో విన్యాసాలు కన్నుల విందుగా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 17 జాగ్వర్ యుద్ధ విమానాలు ‘75’ అంకెగా ఫార్మేషన్ చేయనున్నాయి. ఈ ఫార్మేషన్‌నే ‘అమృత్ ఫార్మేషన్’ అని పేర్కొంటున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ సంబురాలు జరుగుతాయి. మరో ముఖ్య విషయం ఏమంటే.. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన మన దేశం.. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో బ్రిటీష్ మూలాలున్న జాగ్వర్ ఫైటర్ జెట్‌లతో విన్యాసాలు చేయనుంది.

25
Image: Vintage aircraft Dakota at the flypast

భారత వైమానిక దళ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ పీఆర్‌వో వింగ్ కమాండర్ ఇంద్రానిల్ నంది ఈ ఏడాది గణతంత్ర వేడుకలపై మాట్లాడారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీలకు చెందిన విమానాలను ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయని తెలిపారు.

35
Image: The grand finale to the Parade was a spellbinding flypast that saw the Rafale, Tejas, Jaguar, MiG-29 and Mirage 2000 in missing man formation.

గణతంత్ర వేడుకల్లో నిర్వహించనున్న వినాశ్, బాజ్, విజయ్ ఫార్మేషన్‌లలో రాఫేల్ జెట్లు పాల్గొనబోతున్నాయి. వినాశ్ పార్మేషన్‌లో ఐదు రాఫేల్ జెట్లు అంబాలా ఎయిర్‌బేస్ నుంచి వచ్చి పాల్గొంటాయి. కాగా, మిగిలిన రెండు ఫార్మేషన్‌లలో ఒక్కో రాఫేల్ జెట్ పాల్గొనబోతున్నాయి. కాగా, భారత నేవీకి చెందిన ఎంఐజీ-29కే ఫైటర్ జెట్లు, పీ-8ఐ సర్వెలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వరుణ ఫార్మేషన్‌లో పాల్గొంటాయి. 
 

45
Image: IAF Airborne Early Warning and Control aircraft

త్రివిధ దళాలకు చెందిన 75 విమానాలు ఆ రోజు ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ విన్యాసాలతో కనుల విందును పంచనున్నాయి. ఈ 75 విమానాల్లో 8 ఎంఐ-17, 14 అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, ఒక ఎంఐ-35 హెలికాప్టర్లు, 4 అపాచీ హెలికాప్టర్లు, వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ డకోటా, రెండు డోర్నియర్ 228 విమానాలు, ఒక చినూక్ హెలికాప్టర్, మూడు సీ-130 హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక పీ-9ఐ, ఏఈడబ్బ్యూసీ సర్వెలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటాయి. రాజ్‌పథ్‌ మీద ఈ ఏడాది వేడుకల్లో ఏడు సుఖోయ్ యుద్ధ విమానాలు, నాలుగు ఎంఐజీ-29, ఏడు రాఫేల్ జెట్లు, 19 జాగ్వర్, ఒక ఎంఐజీ-29కే విమానాలు విన్యాసాలు చేస్తాయి.
 

55
Image: IAF's Sukhoi-30 MKI air-superiority fighter aircraft

ప్రతి ఏడాది జనవరి 26న భారత్ తన మిలిటరీ శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, సామాజిక, ఆర్థిక వృద్ధిని రాజ్‌పథ్‌లో ప్రదర్శిస్తుంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక రోజు ముందుగానే అంటే జనవరి 23వ తేదీనే ప్రారంభం కానున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి స్మారకంగా జనవరి 23వ తేదీ నుంచే వేడుకలు ప్రారంభం అవుతాయి.

కాగా, 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజయం, బంగ్లాదేశ్ విముక్తి స్మారకంగా ఈ ఏడాది భారత వైమానిక దళ విన్యాసాలు చేయనుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories