Ayodhya Deepotsav 2023: "అద్భుతం, అపూర్వం, చిరస్మరణీయం".. ప్రధాని మోడీ షేర్ చేసిన 'దీపోత్సవ్' ఫోటోలివే..

First Published | Nov 13, 2023, 12:27 AM IST

Ayodhya Deepotsav 2023: దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవం ఏడవ ఎడిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఒకేచోట, ఒకేసారి  22 లక్షలకు పైగా ప్రమిదల్ని వెలిగించినందుకు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ దీపోత్సవానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ ట్విట్ చేస్తూ.. ఏమన్నారంటే..? 

Ayodhya Deepotsav 2023

Ayodhya Deepotsav 2023: దీపావళి సందర్భంగా యూపీలోని అయోధ్యలో దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో రామభక్తులు లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

Ayodhya Deepotsav 2023

సరయూ నది తీరాన నిర్వహించిన ఈ దీపోత్సవంలో ఒకేసారి ఒకేసారి 22.23 లక్షల దీపాలను వెలిగించారు. దీంతో మునుపటి రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.


Ayodhya Deepotsav 2023

అయోధ్యలో జరిగిన ఈ  బ్రహ్మాండమైన దీపోత్సవానికి సంబంధించిన పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ  తన ట్విట్టర్ హ్యాండిల్ పంచుకున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమం అద్భుతం, అపూర్వం, చిరస్మరణీమైనదిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ  దీపావళి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది దీపాలతో వెలిగిపోతున్న అయోధ్య నగరం వెలుగుల మహోత్సవంతో దేశం మొత్తం దేదీప్యమానంగా మారుమోగుతోంది. దీని నుండి వెలువడే శక్తి భారతదేశమంతటా కొత్త ఉత్సాహాన్ని, ఉత్సాహాన్ని పంచుతోంది. దేశ ప్రజలందరినీ శ్రీరాముడు ఆశీర్వదించాలని,  కుటుంబ సభ్యులందరికీ ఆయన స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.

Ayodhya Deepotsav 2023

అయోధ్యలో ప్రపంచ రికార్డు.. కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు అయోధ్యలోని 51 ఘాట్‌లలో ఒకేసారి, ఒకే చోట 22.23 లక్షల దీపాలను వెలిగించారు. ఈ అయోధ్య వెలుగుల పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. 

Ayodhya Deepotsav 2023

2017లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి  అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం దాదాపు 51,000 దీపాలు వెలిగించారు. 2019లో ఆ సంఖ్య 4.10 లక్షలకు పెరిగింది. 2020లో 6 లక్షలకు పైగా, 2021లో 9 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించారు. 2022లో 17 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. ఈ ప్రపంచ రికార్డు గిన్నిస్ బుక్‌లో నమోదైంది. అయితే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఐదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు వెలుగుతున్న దీపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ఈ రికార్డు 15.76 లక్షలకు చేరుకుంది.

Ayodhya Deepotsav 2023

అయోధ్యలోని రామజన్మభూమిలో రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్దమైన వేళ ఈ దీపోత్సవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. రామాలయం ప్రారంభోత్సవం 22 జనవరి 2024న జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరుకానున్నారు.

Latest Videos

click me!