Bangalore
బెంగళూరు : తానో పెద్ద బిల్డర్ అని బిల్డప్ ఇచ్చి పెళ్లిచేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఎలాగూ తన బండారం బయపడుతుందని తెలుసు... అయినా భార్య ఏం చేయకుండా వుండేందుకు ఏ భర్తా చేయనకూడని పని చేసాడు. హనీ మూన్ సమయంలో భార్యతో ఏకాంతంగా గడుపుతూ అదంతా రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియోలతో కట్టుకున్న భార్యనే ఈ నీచుడు బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
Bangalore
వివరాల్లోకి వెళితే... గతేడాది నవంబర్ లో ఓ యువతి పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంది. పెళ్లికి ముందు తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానని... సొంతంగా నిర్మాణ సంస్థ వుందని కుటుంబసభ్యులను నమ్మించి యువతి పెళ్లాడాడు. తీరా పెళ్లి తర్వాత అతడికి ఏ వ్యాపారమూ లేదని... పెళ్ళికోసమే ఇలా అబద్దాలు ఆడి మోసం చేసినట్లు బయటపడింది.
Bangalore
భర్త మోసం గురించి తెలిసినా 28ఏళ్ళ ఈ వివాహిత ఇంతకాలం బయటపెట్టలేదు. అయితే భర్త వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఆమె ఇక భరించలేకపోయింది. భర్త చేసిన మోసం, ఇంతకాలం అతడి బ్లాక్ మెయిల్ తో ఎంతలా నరకం అనుభవించిందో మొత్తం బయటపెట్టింది. బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Bangalore
తాను పెద్ద బిల్డర్ ను అని బిల్డప్ ఇచ్చి పెళ్లిచేసుకున్న భర్త హనీమూన్ కోసం థాయ్ లాండ్ తీసుకెళ్ళాడని తెలిపింది. అక్కడ మద్యం తాగించి, నీలి చిత్రాలు చూపించాడని... ఇలా బెడ్రూంలో జరిగిందంతా రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించాడని బాధిత మహిళ వివరించింది. ఈ వీడియోలతో ఇంతకాలంగా తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడంటూ వివాహిత ఫిర్యాదులో పేర్కొంది.
Bangalore
భర్తకు ఏ వ్యాపారమూ, ఉద్యోగమూ లేదని తెలిసి నిలదీయగా హనీమూన్ సమయంలో తీసిన వీడియోలు చూపించి తననే బెదిరించాడని వివాహిత పేర్కొంది. అంతేకాదు పెళ్ళి సమయంలో ఇచ్చిన కట్నం కాకుండా మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. ఉద్యోగం చేసే తనకు ప్రతి నెలా వచ్చే జీతం మొత్తాన్ని లాక్కునేవాడని ఆమె తెలిపింది. అతడు చెప్పినట్లు వినకుంటే హనీమూన్ వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించేవాడని... అందువల్లే ఇంతకాలం ఎంతలా వేధిస్తున్నా సహించానని వివాహిత తెలిపింది.
Bangalore
అయితే ఇటీవల అతడి వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఇక భరించలేక వివాహిత పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది కాలంగా తాను అనుభవిస్తున్న నరకాన్ని పోలీసులకు వివరించింది. దీంతో సదరు భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.