నుదుట విభూతి, చేతిలో జపమాల... కాషాయ వస్త్రాల్లో ప్రధాని మోదీ మహామునిలా దర్శనం

First Published | May 31, 2024, 11:47 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ వస్త్రాలు ధరించి నుదిటన విభూతి, చేతిలో జపమాలతో ధ్యానం చేస్తున్నారు. ఈ ద‌ృశ్యాన్ని చూస్తే విశ్వగురు అన్న బిరుదు ఆయనకు సరిపోయినట్లు అనిపిస్తోందని... ఓ మహాముని దేశ శ్రేయస్సుకోసం జపం చేస్తున్నట్లు వుందని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి.

PM Modi

కన్యాకుమారి : గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి నెలకొంది. ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు రేపటితో ముగియనున్నాయి... దీంతో లోక్ సభ పోరు ముగుస్తుంది. ఇక కేవలం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మాత్రమే మిగిలివుంటుంది. జూన్ 4న లోక్ సభ ఫలితాలు కూడా రానున్నాయి. ఈ  ఎన్నికల్లోనూ గెలుపుపై బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ధీమాతో వుంది... నరేంద్ర మోదీ కూడా రికార్డులన్నీ బద్దలుగొడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తాననే నమ్మకంతో వున్నారు. ఈ  క్రమంలోనే ఫలితాలపై ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్చింతగా వున్న ఆయన ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టారు. 
 

PM Modi

ఏడో దశ ఎన్నికల ప్రచారం కూడా ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆద్యాత్మిక యాత్ర చేపట్టారు. గురువారం సాయంత్రమే కన్యాకుమారి చేరుకున్న ఆయన భగవతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడినుండి వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకున్నారు. 
 


PM Modi

స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోని ప్రధాని మోదీ కూడా ధ్యానం ప్రారంభించారు. ఇలా ధ్యాన మండపంలోనే మే 30 సాయంత్రం నుండి జూన్ 1  సాయంత్రం వరకు అంటే రెండు రోజులపాటు మోదీ ఏకాంతంగా గడపనున్నాను. ఈ రెండ్రోజులు కేవలం ధ్యానం లోనే వుండనున్నారు. 
 

PM Modi

గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించిన మోదీ ఇవాళ(శుక్రవారం) ఉదయం సరికొత్తగా కనిపించారు. పూర్తిగా కాషాయ వస్త్రాలు ధరించి తెల్లవారుజామునే సూర్యనమస్కారం చేసుకున్నారు.  కాస్సేపు ధ్యానమందిరం బయటే జపమాలను చేతిలో పట్టుకుని నడక సాగించారు.  

PM Modi

ఇక ప్రధాని ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కాషాయ వస్త్రాలు ధరించి, నుదుట విభూతితో ధ్యానంలో కూర్చున్న మోదీ ఓ మహామునిలా కనిపిస్తున్నాడని ఆయన అభిమానులు, బిజెపి శ్రేణులు అంటున్నారు. ఇలా మోదీని చూసేందుకు రెండుకళ్లు చాలడంలేదంటున్నారు. 
 

PM Modi

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సమయంలోనూ ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు.  అప్పుడు కూడా ఆయన పూర్తి ఆద్యాత్మిక చింతనతో గడిపారు. ఇక ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలవడంతో  మోదీలో పక్కా పాలిటీషన్ ను చూసారు ప్రజలు.  ఈ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్న సమయంలో మరోసారి ప్రధాని ఆద్మాత్మిక బాట పట్టారు.

PM Modi

స్వామి వివేకాానంద స్పూర్తితోనే ప్రధాని ధ్యానం చేపట్టినట్లు అర్థమవుతోంది.  వివేకానందుడి మాదిరిగానే పూర్తిగా కాషాయవస్త్రాలు ధరించి ఎంతో నిష్టతో ధ్యానం చేస్తున్నారు. ఇలా ఈ రోజంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడపనున్నారు మోదీ.

Latest Videos

click me!