బైడెన్ భార్యకు మోదీ కానుక :
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కే కాదు ఆయన సతీమణికి జిల్ బైడెన్ కు కూడా ఓ అరుదైన కానుకను అందించారు ప్రధాని మోదీ. మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ లో తయారయ్యే అత్యంత నాణ్యత, అద్భుతమైన చేనేత డిజైన్లతో కూడిన 'పష్మినా'శాలువాను ఆమెకు అందించారు.
ఈ శాలువాను లదాఖ్ లోని ప్రత్యేకమైన మేక ఉన్నితో తయారుచేస్తారు. సుతిమెత్తగా వుండే ఈ ఉన్ని చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి దీంతో తయారుచేసే పష్మినా శాలువాలకు చాలా డిమాండ్ వుంది. దీనికి తోడు ఈ ఉన్నిని దారంగా మలచడం, దాన్ని నైపుణ్యం కలిగిన కళాకారులు చేతితో నేయడం వరకు అంతా ప్రత్యేకమే. వివిధ కళాత్మక డిజైన్లతో ఈ శాలువాలు చూసేందుకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి... అలాగే చలినుండి రక్షణ కల్పిస్తాయి.
ఈ పష్మినా శాలువాలు ఇప్పుడు భారతదేశంలో స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. చాలా ఖరీదైన ఈ శాలువాలను ధనవంతులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ పష్మినా శాలువాలకు జిల్ బైడెన్ కు బహూకరించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. ఇలా భారతీయ కళలను విదేశాలకు పరిచయం చేసిన ప్రధాని మోదీని భారత ప్రజలు అభినందిస్తున్నారు.