ప్రధాని మోదీ బహుమతులకు భలే గిరాకీ ... అత్యధిక ధర కలిగిన టాప్ 5 వస్తువులివే

First Published | Sep 19, 2024, 5:36 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులను వేలం వేస్తున్నారు. ఈ వేలంలో అత్యధిక ధర కలిగిన టాప్ 5 వస్తువులివే.. 

Narendra Modi

Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానులు వున్నారు. ముఖ్యంగా ఆయన మాటలకే ఎక్కువమంది మంత్రముగ్దులు అవుతుంటారు. ఇక గత పదేళ్ళ పాలనను చూసి కొందరు... ప్రజాసంక్షేమం, దేశ అభివృద్ది చూసి మరికొందరు... 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలకు ఇంకొందరు మోదీ అభిమానులుగా మారిపోయారు. తమ అభిమాన నాయకున్ని ఒక్కసారయినా కళ్ళారా చూడాలని, కలిసి మాట్లాడాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ అవకాశం దక్కక నిరాశ పడుతుంటారు. 

ఇలా ప్రధాని మోదీకి సినీ హీరోలు, క్రికెటర్లకు వున్నంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలంతా ఆయనకు అభిమానులే. ఇలా మోదీని అభిమానించేవారికోసం కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. మోదీకి నచ్చిన, ఆయన మెచ్చిన అరుదైన వస్తువులను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. 
 

Narendra Modi

మోదీ బహుమతులను ఎలా పొందాలంటే : 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సెప్టెంబర్ 17న 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. యావత్ దేశం ఆయన పుట్టినరోజును జరుపుకుంటే మోదీ మాత్రం రోజూ లాగే పాలనా కార్యక్రమాల్లో మునిగిపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మోదీ బర్త్ డే సందర్భంగా ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతుల వేలంపాటను ప్రారంభించింది. 

ఈ ఏడాది మోదీకి వచ్చిన దాదాపు 600 పైగా వస్తువులను వేలంపాటలో వుంచింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో వందల నుండి వేలు, లక్షలు విలువచేసే వస్తువులు కూడా వున్నాయి. వీటన్నింటి వేలంపాట ద్వారా కోటి రూపాయలకు పైగా వస్తాయని భావిస్తున్నారు. 

మోదీ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 17,2024 న వస్తువుల ఈ‌-వేలంపాట ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా జరిగే ఈ వేలంపాట అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి వరకు కొనసాగనుంది. ఇందులో పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ ల షూస్, క్యాప్ తో పాటు ఆద్యాత్మిక అయోద్య రామమందిర నమూనా జ్ఞాపిక కూడా వుంది. వేలంపాటలో వున్న వస్తువుల కోసం https://pmmementos.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి. 
 


Narendra Modi

ఈ-వేలంలో పాల్గొనడం ఎలా? 

మోదీ బహుమతుల్లో ఏవయినా కావాలనుకుంటే ఈ-వేలంపాటలో పాల్గొనవచ్చు. ఇందుకోసం https://pmmementos.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి లాగిన్ కావాలి. ఈమెయిల్ లేదా మీ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ కావాల్సి వుంటుంది. మొదటిసారి లాగిన్ కావాలనుకునేవారు ముందుగా మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని పాస్ వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్, పాస్ వర్డ్ తో లాగిన్ అయి ఈ-వేలంలో పాల్గొనవచ్చు. 

మోదీకి బహుమతిగా వచ్చిన వస్తువులను ఆయన పుట్టినరోజున వేలంవేసే ప్రక్రియ 2019 లో ప్రారంభమయ్యింది. అప్పటినుండి కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను నిర్వహిస్తూ వస్తువులను వేలం వేస్తోంది. ఇందులో వివిధ సందర్భాల్లో క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, విదేశీ అతిథులతో పాటు సామాన్యులు అందించే ఆసక్తికరమైన బహుమతులను వేలం వేస్తారు. ఇలా ఇప్పటివరకు జరిగిన ఐదు ఎడిషన్స్ ఈ‌‌-వేలం ద్వారా రూ.50 కోట్లు సమకూరినట్లు తెలుస్తోంది. ఈ నిధులను గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమానికి ఉపయోగించనున్నారు. 
 

CAP

తాజా వేలంపాటలో టాప్ 5 బహుమతులివే :

పారా ఒలింపిక్ క్రీడాకారుడు నిషాద్ కుమార్ షూస్ :  

పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుడు నిషాద్ కుమార్ హైజంప్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇలా ఒలింపిక్స్ మెడల్ సాధించిన సమయంలో ఉపయోగించిన స్పోర్ట్స్ షూస్ ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చాడు. ఈ షూస్  ప్రస్తుతం రూ.10 లక్షల ధర పలుకుతోంది. 

పారా ఒలింపిక్ క్రీడాకారుడు శరద్ కుమార్ క్యాప్ : 

ఇటీవల జరిగిన పారిస్ పారా ఒలింపిక్స్ లో భారతీయ క్రీడాకారుడు శరద్ కుమార్ హైజంప్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన అతడు సంతకం చేసిన తెల్లటి క్యాప్ ను బహూకరించాడు. ఈ క్యాప్ తాజా వేలంపాటలో వుంది. ఇది ప్రస్తుతం రూ.9 లక్షల ధర పలుకుతోంది. 

పారా ఒలింపిక్ క్రీడాకారుడి అజిత్ సింగ్ షూస్ : 

పారిస్ పారా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన అజిత్ సింగ్ ప్రధాని మోదీకి షూస్ బహుమతిగా ఇచ్చాడు. ఆ షూస్ ప్రస్తుతం వేలంపాటలో పెట్టారు. వీటిని వేలంపాటలో దక్కించుకోవాలంటే రూ.8,26,100 పైగా వెచ్చించాలి. 

Ayodhya

పారా ఒలింపిక్ క్రీడాకారిణి సిమ్రన్ శర్మ షూస్ ; 

పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ సిమ్రన్ శర్మ 200 మీటర్ల పరుగుపందెంలో విజేతగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.ఈమె తన షూస్ ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వగా వాటిని రూ.8,26,100 కనీస ధరకు వేలంలో పెట్టారు. 
 
అయోధ్య రామమందిర నమూనా జ్ఞాపిక :  

పవిత్రమైన అయోధ్య రామమందిర నమూనా జ్ఞాపికను కూడా ఈ-వేలంపాటలో వుంచారు. దీనిని ప్రస్తుతం 6 లక్షల రూపాయలు చెల్లించి దక్కించుకునేందుకు రెడీగా వున్నారు. 

Latest Videos

click me!