తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా?

First Published | Sep 19, 2024, 12:42 AM IST

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పారు. దీంతో తిరుమల లడ్డూ పవిత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకారప్రియుడే కాకుండా, నైవేద్యప్రియుడుకూడా. అందుకే స్వామివారి నైవేద్యంగా పెట్టే లడ్డూ, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ (టిటిడి) భక్తులకు ప్రసాదంగా అందిస్తుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ లడ్డూను రుచించి, ఇంటికి తీసుకెళ్లి బంధువులకు పంచుతారు.  దీని తయారీ చాలా కట్టుదిట్టంగా జరుగుతుంది.

కొత్త వివాదం

ఇటీవల కాలంలో తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పారు. దీంతో తిరుమల లడ్డూ పవిత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతకు ముందు ఇతర మతాలకు చెందిన వ్యక్తులు లడ్డూ తయారీలో  పాల్గొంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో టిటిడి స్పందిస్తూ, ఈ ప్రచారం తప్పుడు ప్రచారం అని పేర్కొంది.

స్వామివారి లడ్డూ తయారీలో వాయిష్ణవ బ్రాహ్మణులే పాల్గొంటారని, హిందూ మతానికి చెందినవారే తయారీలో ఉన్నారని వెల్లడించింది.  ఈ నేపథ్యంలో అసలు తిరుమల లడ్డూని ఎలా తయారు చేయాలనే అంశాలను, విధి విధానాలను ఓ సారి చూద్దాం.

Latest Videos


లడ్డూ తయారీకి ఉపయోగించే పదార్థాలు


తిరుమలలో లడ్డూ తయారీ పూర్తిగా శ్రద్ధతో, సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు:
శనగపిండి: మెత్తగా చేసిన శనగపిండి.
ఆవు నెయ్యి: స్వచ్ఛమైన ఆవు నెయ్యి.
జీడిపప్పు: అత్యుత్తమ నాణ్యత గల జీడిపప్పు.
ఎండుద్రాక్ష: రుచికి తీపి.
యాలకులు: మంచి వాసన కోసం.
చక్కెర: రుచి కోసం చక్కెర.

లడ్డూ తయారీలో కొలతలు

లడ్డూ తయారీలో ప్రతి పదార్థం ఎంత మోతాదులో వాడాలో నిర్ణయించేదే ‘దిట్టం’. 1950లో మొదటిసారిగా దీనిని నిర్ణయించారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, 2001లో దిట్టంలో మార్పులు చేసి, ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు. 5,100 లడ్డూల తయారీలో 803 కిలోల ముడిసరుకులను ఉపయోగిస్తారు. 
...
ప్రతి 100 లడ్డూలకు ఉపయోగించే పదార్థాలు:
శనగపిండి : 180 కిలోలు
ఆవు నెయ్యి: 165 కిలోలు
చక్కెర: 400 కిలోలు
జీడిపప్పు: 30 కిలోలు
ఎండుద్రాక్ష: 16 కిలోలు
యాలకులు: 4 కిలోలు

లడ్డూ తయారీ స్థలం


తిరుమల ఆలయ ప్రాంగణంలోని లడ్డూ తయారీ వంటశాలను ‘పోటు’ అంటారు. ఇదే వంటశాలలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రోజూ 2-3 లక్షల లడ్డూలు తయారు అవుతుంటాయి. పెద్ద పండుగల సందర్భాల్లో ఈ సంఖ్య 8 లక్షల వరకు పెరుగుతుంది. 
పేటెంట్ : తిరుమల లడ్డు చాలా ప్రత్యేకమైనది. ఈ రుచి మరెక్కడా దొరకదు. దీంతో ఈ లడ్డుకు టిటిడి పేటెంట్ తీసుకుంది. 2009 లో తిరుమల లడ్డుకు పేటెంట్ లభించింది. దీంతో ఇతరులెవ్వరూ తిరుమల పేరుతో లడ్డుల తయారీ నిరోధించబడింది.  

లడ్డూల్లో రకాలు

ప్రోక్తం లడ్డు : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డును అందిస్తారు. ఇది చిన్న పరిమాణంలో అంటే 60 నుండి 75 గ్రాముల బరువు వుంటుంది. పోటులో ఎక్కువగా ఈ లడ్డుల తయారే జరుగుతుంది. 

ఆస్థానం లడ్డు : ప్రత్యేక పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా తయారుచేసే లడ్డూ ఇది. ఇది చాలా పెద్దగా అంటే 750 గ్రాముల వరకు వుంటుంది. ఇందులో జీడిపప్పు, బాదం మరియు ఇతర పదార్థాలు బాగా దట్టించి తయారుచేస్తారు. 

కల్యాణోత్సవం లడ్డు : ఈ లడ్డూను కల్యాణోత్సవం మరియు కొన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పంచుతారు. ఈ లడ్డూలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రోక్తం లడ్డూతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ సంఖ్యలో తయారు చేయబడతాయి.  
మొత్తానికి నియమ నిబంధనల ప్రకారం చూస్తే.. తిరుమల లడ్డూలో ఆవు నెయ్యినే వినియోగించాలి.

click me!