Macron India Visit: జైపూర్‌ లో ప్రధాని మోదీ, మాక్రాన్ రోడ్ షో .. ఫోటోలు వైరల్..

First Published | Jan 26, 2024, 3:43 AM IST

Macron India Visit: భారత దేశ 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు మాక్రాన్ గురువారం బారత్ కు చేరుకున్నారు.  

PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు మాక్రాన్ గురువారం భారత్ కు వచ్చారు. మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం జైపూర్ చేరుకున్నారు. 

PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వాగతం పలికారు. అటు.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైపూర్‌ చేరుకున్నారు. సాయంత్రం జైపూర్‌లో ప్రధాని మోదీ, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రోడ్ షో నిర్వహించి పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు.

Latest Videos


PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

ఈ సమయంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌, మోదీ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.

PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

మాక్రాన్ గౌరవార్థం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎం రాజకుమారి దియా కుమారి, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జంతర్ మంతర్‌కు సాయంత్రం చేరుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు జంతర్‌మంతర్‌ నుంచి సంగనేరి గేట్‌ వరకు భారీ ఉమ్మడి రోడ్‌షో నిర్వహించారు.  

PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

ఈ క్రమంలో ప్రధాని మోడీ అయోధ్య శ్రీరామ మందిర ప్రతిరూపాన్ని  బహుమతిగా ఇచ్చారు. హవా మహల్ దగ్గర ప్రముఖుల సందర్శన కోసం హస్తకళా కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్ ప్రైవేట్ డిన్నర్ చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లిపోయారు. శుక్రవారం జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

ఫ్రాన్స్‌తో అనేక రక్షణ ఒప్పందాలు

ఫ్రెంచ్ యుద్ధ విమానాలు, సైన్యం కోసం జలాంతర్గాముల కోసం కేంద్ర, ఫ్రాన్స్ ప్రభుత్వాలు బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంటున్న తరుణంలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ పర్యటన జరుగుతోంది. భారత్ ప్రతిపాదించిన 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు స్కార్పియన్ జలాంతర్గాముల కొనుగోలుపై కూడా ద్వైపాక్షిక చర్చల్లో చర్చించనున్నారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది.

PM Modi, French President Macron hold mega roadshow in Jaipur

ఈసారి గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కానీ చివరి నిమిషంలో, అధ్యక్షుడు బిడెన్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అధ్యక్షుడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైట్‌హౌస్ నిరాకరించడంతో ప్రధాన అతిథిగా రావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చివరి నిమిషంలో భారత్ ఆహ్వానం పంపింది. రిపబ్లిక్ డే వేడుకల ఆహ్వానాన్ని చివరి నిమిషంలో అధ్యక్షుడు మాక్రాన్ అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఇది ప్రతీకగా భావించారు. గతేడాది జూలైలో ఫ్రాన్స్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ అతిథిగా హాజరయ్యారు.

click me!