మీరు అయోధ్యకు వెళ్లినా బాలరాముడిని ఇంత దగ్గరగా చూడలేరు..

First Published | Jan 22, 2024, 2:20 PM IST

సాకారమైన అపురూపక్షణాలు.. అయోధ్య రామాలయంలో ప్రాణం పోసుకున్న బాలరాముడు. 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు కళ్లముందే సాకారంగా మారాయి. బాలరాముడు.. అయోధ్య రాముడు.. అందాల రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం అభిజీత్ ముహూర్తంలో జరిగింది. 

అందాల రాముడి కమనీయ రూపం కనులవిందు.. జీవం ఉట్టిపడే ఆ మనోహర రూపుడిని చూడడానికి రెండు కళ్లూ చాలవు. నయనమనోహరం ఆ రూపం. 


శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ ధన్యుడు. బాలరాముడిని సజీవంగా కళ్లకు కట్టినట్టుగా మలచడంతో కృతకృత్యుడయ్యాడు. 

84 సెకండ్ల అద్భుతమైన దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ట జరిగింది. జనవరి 22, సోమవారం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. 

అయోధ్యకు వచ్చే భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించుకున్న తర్వాత బాల రాముడిని దర్శించుకోవాలి. అయోధ్య రాముడి దర్శనం జనవరి 23నుంచి సామాన్యులకు అనుమతి ఉంటుంది. 

ramlalla

అయోధ్యలో బాలరాముడిని 35 అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకోవడానికి వీలవుతుంది. సకలకళా వల్లభుడైనా ఆ సుగుణాభిరాముడి కటాక్షవీక్షణాలు ఎంతదూరం నుంచైనా భక్తుల మీదికి ప్రసరిస్తాయి. 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ యజమాని హోదాలో విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. దీనికోసం 11 రోజుల పాటు కఠిన ఉపవాసదీక్షను పాటించారు. 

ఆ విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోతే చాలు.. లోకంలోని ఏ కష్టం, కన్నీళ్లూ.. బాధలూ గుర్తుకురావు. ఏ మోహాలూ దరిచేరవు. ఏ దురాశా బాధించదు. 

Latest Videos

click me!