ప్రధానిగా మోదీ ప్రతి దీపావళి సైనికులతోనే ... 2014 నుండి 2024 వరకు ఎక్కడెక్కడ జరుపుకున్నారంటే...

First Published Nov 1, 2024, 1:52 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈసారి కూడా భారత సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఇలా ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినతర్వాత వరుసగా 11వ ఏడాది కూడా ఆర్మి జవాన్లతో దీపావళి జరుపుకున్నారు. 2014 నుండి 2024 వరకు మోదీ దీపావళి ఎక్కడ జరుపుకున్నారో చూద్దాం.

2024: కచ్‌లో సైనికులతో దీపావళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దీపావళిని సొంతరాష్ట్రం గుజరాత్ లో జరుపుకున్నారు. అయితే తన కుటుంబసభ్యులతోనో, స్నేహితులతోనో సరదాగా టపాసులు కాలుస్తూ పండగను జరుపుకోలేదు...  పండగపూట కూడా తల్లిదండ్రులు, భార్యాబిడ్డలకు దూరంగా దేశ రక్షణకోసం సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న జవాన్లతో జరుపుకున్నారు. ఆర్మీ జవాన్లకు కుటుంబసభ్యుడి మాదిరిగా ప్రేమగా స్వీట్స్ తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. 

గురువారం దీపావళి పండగను పురస్కరించిన గుజరాత్ లోని కచ్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రత్యేక పడవలో సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఆయన సర్ క్రిక్ ప్రాంతంలోని లక్కీ నాలాకు చేరుకున్నారు. అక్కడ త్రివిద దళ (ఆర్మీ (బిఎస్ఎఫ్), నేవీ, వైమానిక దళ) సైనికులతో దీపావళిని జరుపుకున్నారు.

దేశ భద్రత విషయంలో ఈ ప్రాంతం చాలా కీలకమైనది...అలాగే వాతావరణం పరంగా చాలా కఠినమైనది. ఇక్కడ పగలు చాలా వేడిగా, రాత్రులు చాలా చల్లగా ఉంటుంది. ఇలా క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో దేశ రక్షణకోసం విధులు నిర్వర్తిస్తున్న సైనికులలో దీపావళి జరుపుకుని ఆత్మస్తైర్యం నింపారు ప్రధాని మోదీ. 

2023 లో మోదీ దీపావళి

ప్రధాని నరేంద్ర మోదీ 2023లో హిమాచల్ ప్రదేశ్‌లోని దీపావళి జరుపుకున్నారు. చైనా సరిహద్దులోని లెప్చా సైనిక స్థావరంలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటిబిపి) లతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ''మీరు ఎక్కడుంటే అక్కడే నాకు పండగ'' అంటూ ప్రధాని సైనికుల్లో ఉత్తేజం నింపేలా మాట్లాడారు.

Latest Videos


కార్గిల్‌లో సైనికులతో దీపావళి

ప్రధాని మోదీ 2022 దీపావళిని కార్గిల్‌లోని సైనికులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 1999లో అమరులైన సైనికులను స్మరించుకున్నారు.

2021 దీపావళిన ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌కు వెళ్లారు. అక్కడ సైనికులకు స్వీట్లు పంచి దీపావళి జరుపుకున్నారు.

2020 లాంగేవాలా, 2019 రాజౌరీలో ప్రధాని దీపావళి

ప్రధాని మోదీ 2020లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లారు. అక్కడి లాంగేవాలా పోస్ట్‌లో సైనికులతో దీపావళి జరుపుకున్నారు.ఇక 2019 లో ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో ఎల్‌ఓసీ వద్ద సైనికులతో స్వీట్లు తినిపించి దీపావళిని జరుపుకుని వారిని ఉత్సాహపరిచారు.

2018లో హర్షిల్ గ్రామంలో దీపావళి

ప్రధాని మోదీ 2018లో ఉత్తరాఖండ్‌లో చైనా సరిహద్దులోని హర్షిల్ గ్రామానికి వెళ్లారు. అక్కడ సాయుధ దళాలు, ఐటీబీపీ సైనికులతో దీపావళి జరుపుకుని చైనాకు సందేశం ఇచ్చారు.  2017 దీపావళిని జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో జరుపుకున్నారు.

లాహౌల్ స్పితిలో 2016 దీపావళి

ప్రధాని మోదీ 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న లాహౌల్ స్పితి గ్రామానికి వెళ్లారు. అక్కడ ఐటీబీపీ సైనికులతో దీపావళి జరుపుకున్నారు. ప్రధాని మోదీ 2015 దీపావళిని పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలోని సరిహద్దులోని   సైనికులతో జరుపుకున్నారు.

2014 దీపావళి సియాచిన్‌లో

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి దీపావళిని నరేంద్ర మోదీ సియాచిన్‌లో సైనికులతో జరుపుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రతి ఏటా ఏదో ఒక సరిహద్దులో సైనికులతో దీపావళి జరుపుకుంటున్నారు.

click me!