PM Modi: జమ్మూ చేరుకున్న ప్రధాని మోదీ.. సైనికులతో దీపావళి వేడుకలు.. ఫొటోలు

First Published Nov 4, 2021, 11:31 AM IST

ప్రధాని మోదీ ఈ దీపావళి (Diwali) వేడుకలను సైనికకులతో జరుపుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. గురువారం ఉదయం జమ్మూ‌కు చేరుకున్నారు. 
 

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు తమ ప్రియమైన వారితో ఈ పండను జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పులవురు ప్రముఖులు.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రధాని మోదీ ఈ దీపావళి వేడుకలను సైనికకులతో జరుపుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ.. గురువారం ఉదయం జమ్మూ‌కు చేరుకున్నారు.  నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లోని నౌషేరా, రాజౌరి సరిహద్దు పోస్ట్‌ను మోదీ సందర్శించనున్నారు. అక్కడే సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలను జరుపుకుంటారు.

మోదీ తన ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. అక్కడి సైనికుల‌తో మాట్లాడనున్నారు. ఇక, ఇటీవల కేంద్ర హోం మత్రి అమిత్ షా కూడా మూడు రోజులు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. 

ప్రధాన మంత్రి మోదీ 2019లో దీపావళి వేడుకలను రాజౌరీలో సైనికులతో జరుపుకున్నారు. గతేడాది జస్తాన్‌లోని జైసల్మీర్‌‌ సరిహద్దులో భారత సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. (ఫైల్ ఫొటో)
 

గతంలో భారత సైనికులతో ప్రధాన మంత్రి రేంద్ర మోదీ మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వారికి తన చేతులతో స్వీట్లు పంపిణీ చేశారు. (ఫైల్ ఫొటో)

గతంలో భారత సైనికులతో ప్రధాన మంత్రి రేంద్ర మోదీ మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వారికి తన చేతులతో స్వీట్లు పంపిణీ చేశారు. (ఫైల్ ఫొటో)

click me!