pm kisan: గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

Published : Jun 09, 2025, 10:42 AM IST

pm kisan: పీఎం కిసాన్ 20వ విడత ఆర్థిక సాయం జూన్‌లో విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ రూ.2,000 పొందాలంటే eKYC, ఆధార్-బ్యాంక్ లింకింగ్ తప్పనిసరిగా ఉండాలి.

PREV
16
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 20వ విడత

PM Kisan: రుతుపవనాల రాకతో పంటలు వేయడానికి రెడీగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 20వ విడత విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా వార్షికంగా రూ.6,000 నగదు మద్దతుగా మూడుసార్లు, ఒక్కో విడతగా రూ.2,000 చొప్పున అందజేస్తారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 19 విడతలు విడుదలయ్యాయి. చివరి విడత (19వది) ఫిబ్రవరిలో విడుదలైంది. 20వ విడతను జూన్‌లో విడుదల చేయనున్నారు.

26
పీఎం కిసాన్ 20వ విడత పొందాలంటే ఇవి చేయాలి

రైతులు తమకు సకాలంలో పీఎం కిసాన్ నగదు అందాలంటే eKYC పూర్తిచేయడం, ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం తప్పనిసరి. దీనిని నేరుగా బ్యాంకులో లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదా ఆధార్-ఆధారిత బ్యాంకింగ్ సేవల ద్వారా చేసుకోవచ్చు.

36
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లో వివరాలు

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లో “PM-Kisan రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించండి” అని పేర్కొన్నారు.

46
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్: https://pmkisan.gov.in/

2. హోం పేజీలో కుడివైపున ఉన్న ‘Beneficiary list’ ట్యాబ్‌ను క్లిక్ చేయండి

3. రాష్ట్రం, జిల్లా, మండలం, బ్లాక్, గ్రామం వివరాలు ఎంచుకోండి

4. ‘Get Report’ క్లిక్ చేయగానే లబ్ధిదారుల జాబితా చూపిస్తుంది. అందులో మీ వివరాలు తెలుసుకోవచ్చు

56
ప్రధాన్ మంత్రి కిసాన్ పథకం (పీఎం కిసాన్)

పీఎం కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించింది. దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు వ్యవసాయ అవసరాలకు తోడ్పడే ఉద్దేశంతో వార్షికంగా రూ.6,000 మద్దతుగా అందిస్తున్నారు. ఈ ఏడాది రెండవ విడత 2025 జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తక్షణమే తమ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

66
పీఎం కిసాన్: తరచుగా అడిగే ప్రశ్నలు

1. పీఎం కిసాన్ కు ఎవరికి అర్హత ఉంటుంది?

అందుబాటులో ఉన్న భూమిని తమ పేరిట కలిగి ఉన్న రైతు కుటుంబాలు మాత్రమే అర్హులు.

2. కుటుంబంలో ఒకరు ఆదాయం పన్ను చెల్లిస్తే పీఎం కిసాన్ అర్హత ఉంటుందా?

లేదు. గత ఆర్థిక సంవత్సరం లో కుటుంబంలో ఏ ఒక్కరు అయినా ఆదాయపు పన్ను చెల్లిస్తే, వారు అర్హులు కారు.

3. పీఎం కిసాన్ గత విడత రాలేదంటే ఏం చేయాలి?

లబ్దిదారుల స్టెటస్ సెక్షన్‌లో ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తో తమ స్థితిని తెలుసుకోవచ్చు. eKYC పూర్తయ్యిందా, బ్యాంక్ లింకింగ్ జరిగిందా అన్నదాన్ని పరిశీలించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారులను సంప్రదించాలి.

Read more Photos on
click me!

Recommended Stories