పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని రోజుల్లో రిలీజ్ ఉండడంతో ఓజీ కన్సర్ట్ పేరుతో ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. జోరున వర్షం కురుస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నేడు ఆదివారం రోజు ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవైపు గ్రాండ్ గా జరుగుతుంటే బోరున వర్షం మొదలైంది. అయినా కూడా అభిమానుల కేరింతల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కొనసాగింది. వర్షం కారణంగా కొందరు అతిథులు మాట్లాడలేకపోయారు.
25
వర్షంలో పాట పాడిన పవన్
పవన్ కళ్యాణ్ వెంటనే స్టేజి ఎక్కి బోరున వర్షం కురుస్తున్నప్పటికీ వాషి ఓ వాషి అనే జపనీస్ సాంగ్ పాడి అలరించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సుజీత్ వల్ల తాను సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్ తో ఇక్కడికి వచ్చానని చమత్కరించారు. సుజీత్ అనే యువ దర్శకుడు ఉన్నాడు.. అతనితో సినిమా చేస్తే బావుంటుంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకి సలహా ఇచ్చినట్లు పవన్ తెలిపారు.
35
ఈ మూవీ క్రెడిట్ వాళ్ళిద్దరిదే
ఈ చిత్రానికి ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు డైరెక్టర్ సుజీత్ అయితే మరొకరు సంగీత్ దర్శకుడు తమన్. ఈ మూవీ క్రెడిట్ వాళ్ళిద్దరిదే అని పవన్ ప్రశంసలు కురిపించారు. సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని పవన్ అన్నారు. ప్రియాంక మోహన్ తో 80 దశకంలో జరిగే లవ్ స్టోరీ ఈ చిత్రంలో ఉంటుంది. తక్కువ నిడివి అయినప్పటికీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఖుషి తర్వాత అంతటి జోష్ ఈ చిత్రానికే చూస్తున్నా అని పవన్ అన్నారు.
ఇమ్రాన్ హష్మీ గారితో కలిసి నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో విలన్ గా నటించారు. అదే విధంగా కీలక పాత్రలో నటించిన శ్రీయ రెడ్డిపై పవన్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆమె అద్భుతమైన పెర్ఫార్మర్ అని పవన్ అన్నారు. ఆమె ఒక ఆడ సివంగి. ఆమె ఫిట్నెస్ లెవల్స్ చూస్తే మతి పోద్ది. ఆమెతో ఎవరైనా గొడవ పెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా ఆలోచించాల్సిందే అని పవన్ అన్నారు.
55
ట్రైలర్ విషయంలో గందరగోళం
ఈవెంట్ దాదాపుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే ఉన్నారు. వర్షం పడుతుండడంతో మిగిలిన వాళ్లకి మాట్లాడే అవకాశం రాలేదు. ట్రైలర్ లో డిలే ఉందని తెలిసింది. అయినప్పటికీ మా వాళ్ళకి ఈ రోజు ట్రైలర్ చూపించాల్సిందే అని పవన్ అన్నారు. దీనితో అక్కడున్న అభిమానుల కోసం ట్రైలర్ ప్రదర్శించారు. కానీ దానిని లైవ్ లో టెలికాస్ట్ చేయలేదు. ట్రైలర్ ఆన్లైన్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ కూడా చిత్ర యూనిట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.