Published : May 07, 2025, 07:02 AM ISTUpdated : May 07, 2025, 07:07 AM IST
పహల్గాం ఉగ్రదాడులకు భారత్ ప్రతీకాారం తీర్చుకుంది. పాకిస్థాన్ తో పాటు పివోకే లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా యుద్దవిమానాలు దాడులు చేసాయి. ఇందులో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే..
Operation Sindoor : పాకిస్థాన్ పై భారత్ భీకర దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా వైమానిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
25
Operation Sindoor
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై యుద్దం ప్రకటించింది. పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రమూకల ఆటకట్టించేందుకు సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోనే ఉగ్రస్థావరాలను గుర్తించారు. వాటిపై ఇవాళ మెరుపుదాడులకు దిగి నేలమట్టం చేసారు.
35
Masood Azhar
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ నివాసం, జైషే మహమ్మద్ స్థావరాలపై కూడా భారత విమానాలు దాడులు చేసాయి. మొత్తం 9 స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన వాయుసేన 30 మంది తీవ్రవాదుల హతం చేసింది. మమరో 55 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లి, ముజఫరాబాద్, పాక్ పంజాబ్ లోని బహవల్ పూర్ లో భారత వాయుసేన దాడిచేసింది. అలాగే మురిద్కే, గుల్ పూర్, భింబర్, చక్ అమ్రు, బాగ్, సియాల్ కోట్ ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. ఇందులో 30 మంది మరణించారు.
55
Operation Sindoor
ఆపరేషన్ సింధూర్ పై పాక్ కూడా స్పందించింది. భారత వాయుసేన దాడిలో కేవలం 8 మంది మరణించినట్లు పాక్ చెబుతోంది. తమ భూభాగంలోకి చొరబడి భారత్ దాడులు జరపడం యుద్దం చేయడమేనని పాకిస్థాన్ అంటోంది. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ హెచ్చరిస్తోంది.