గుడ్ న్యూస్ : ఇక మీదట వాట్సప్ లోనే వాక్సిన్ స్లాట్ బుకింగ్..

First Published Aug 24, 2021, 2:33 PM IST

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం ఓ ట్వీట్ చేశారు.  "పౌరుల సౌలభ్యంలో మరో కొత్త అంకానికి తెరతీశాం. ఇప్పుడు, మీ ఫోన్‌లోనే COVID-19 వ్యాక్సిన్ స్లాట్‌లను నిమిషాల్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు" అని ట్వీట్‌లో తెలిపారు.

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎదురుచూస్తున్న లక్షలాది భారతీయులకు తీపి కబురు చెప్పారు. ఇక మీదట వ్యాక్సిన్ స్లాట్ లను వాట్సప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోవడం ఓ ఎత్తైతే దానికోసం స్లాట్ బుక్ చేసుకోవడం మరో ప్రక్రియ. ఇది అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఈ చర్య మరింత దోహదపడుతుంది. 

దీన్ని వాట్సాప్ కూడా నిర్థారించింది. వాట్సాప్ ద్వారా MyGov కరోనా హెల్ప్‌డెస్క్ యూజర్లు తమ సమీప టీకా కేంద్రాన్ని గుర్తించడానికి, వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుందని వాట్సాప్ ప్రకటించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం ఓ ట్వీట్ చేశారు.  "పౌరుల సౌలభ్యంలో మరో కొత్త అంకానికి తెరతీశాం. ఇప్పుడు, మీ ఫోన్‌లోనే COVID-19 వ్యాక్సిన్ స్లాట్‌లను నిమిషాల్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు" అని ట్వీట్‌లో తెలిపారు.

ఈ ఆగస్ట్ 5 న, MyGov, WhatsApp చాట్‌బాట్ నుండి టీకా సర్టిఫికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 32 లక్షల మంది యూజర్లు సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

"వాట్సాప్‌లో మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్, మార్చి 2020 లో ప్రారంభమయ్యింది. అప్పటి నుండి, మహమ్మారి సమయంలో COVID-సంబంధిత సమాచారానికి అత్యంత ప్రామాణికమైన సోర్స్ గా నిలిచింది.  మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభంలో ఆరోగ్య సమాచారాన్ని అందించే కీలక సాధనంగా ఇది నిలిచింది. దేశవ్యాప్తంగా దాదాపు 41 మిలియన్లకు పైగా వినియోగదారులకు ఈ సేవలను వాడుకున్నారు.

మైగోవ్ సిఇఒ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పౌరులకు సమాచారాన్ని వేగంగా అందించే గొప్ప సాంకేతిక పరిష్కారంగా మారిందన్నారు. 

"ఇది ప్రారంభించినప్పటి నుండి, మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్, హప్టిక్, టర్న్ మద్దతుతో ప్రారంభించబడింది.  గో-టు ప్లాట్‌ఫారమ్‌గా అభివృద్ధి చెందింది. ఇది పౌరులకు ప్రామాణికమైన కరోనా-సంబంధిత సమాచారం అందిస్తూ సహాయపడటమే కాకుండా.. ఇప్పుడు టీకా ప్రక్రియలో కూడా వారికి సహాయపడుతోంది. టీకా కేంద్రాలు, స్లాట్‌లను కనుగొనడం, టీకా సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటివి కూడా బుకింగ్ చేసుకోవచ్చు’’

వాట్సాప్‌లో AI ఆధారిత ఇంటర్‌ఫేస్ ఎనేబుల్ చేయబడడం వల్ల.. చాలా మంది వినియోగదారులు నావిగేట్ చేయడం సులభంగా ఉందని చెబుతున్నారు. ఈ కలయిక వలన పౌరులకు సాంకేతిక సాయంతో మరింత చేరువ కావడానికి, మరిన్ని ప్రయోజనాలు చేకూరడానికి సాయపడింది. మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌ చాట్‌బోట్ మీద నమ్మకం ఉంచి, బెనిఫిట్స్ కోసం వాడుతున్న వారి వల్ల భారత్ డిజిటల్‌గా సాధికారత కలిగిన దేశంగా మారుతున్న ప్రక్రియలో మరో కీలక అడుగుగా మారింది అన్నారు. 

"మహమ్మారిపై పోరాటంలో సహాయపడే ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఒక వేదికగా మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం" అని వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ అన్నారు.

మై గోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌ చాట్‌బాట్‌ను సంప్రదించడానికి, పౌరులు తమ ఫోన్‌లలో WhatsApp నంబర్ +91 9013151515 ని సేవ్ చేసుకోవాలి. 'బుక్ స్లాట్' అని టైప్ చేయడం ద్వారా చాట్ ప్రారంభమవుతుంది. ఈ నెంబర్ కు పంపాలి. ఇది సంబంధిత మొబైల్ ఫోన్ కు ఆరు అంకెల వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను పంపిస్తుంది.

ఈ పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యాక.. పిన్ కోడ్ లొకేషన్ ను బట్టి మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్లను గుర్తించొచ్చు. అప్పుడిక మీకు కావాల్సిన వ్యాక్సిన్, డేట్, టైం చూసుకుని బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటువినియోగదారులందరూ తమ సెంటర్, టీకా అపాయింట్‌మెంట్ రోజు నిర్ధారణ పొందడానికి కూడా ఇదే పద్ధతి పాటించొచ్చు. 

click me!