Anand Mahindra Peacock Video : మీ మనసుల్ని తప్పకుండా కదిలిస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

First Published Aug 12, 2021, 1:50 PM IST

ఈ వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ఇది పాత వీడియోనే.. ఇందులో ఏం విశేషముంది అని మీకు అనిపించవచ్చు. అంతేకాదు ఓ మహిళ పక్షికి ఆహారం పెడుతుంది. మహిళలు, పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం సాధారణ విషయమే కదా అనిపిస్తుంది. కానీ ఈ వీడియోను చూస్తే మీ మనసులో కదలిక మొదలవుతుంది. 

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన ట్విట్టర్ పేజీలో ఎన్నో రకరకాల పోస్ట్‌లు పెడుతుంటారు. వీటిల్లో ఎడ్యుకేషన్ సంబంధించినవి, 'కేవలం సరదా కోసం' కొన్ని ఉండగా.. మరికొన్ని పూర్తిగా స్ఫూర్తిదాయకమైనవి ఉంటాయి. ఇవి చాలాసార్లు ఎంతోమంది ఆకర్షిస్తూ ఆయనను స్పూర్తిగా తీసుకునేలా చేస్తాయి.  అలాంటిదే ఓ పాత వీడియోను ఇటీవల ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ లో షేర్ చేశారు. 

ఇటీవల ఆయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది. అది పాతదే అయినా మళ్లీ ఓసారి రీపోస్ట్ చేశారాయన. ఈ వీడియోలో ఓ మహిళ..  కూరగాయలమ్ముతుంది. ఆమె దగ్గరికి ఓ నెమలి వచ్చింది. ఆమె తన అరచేతిని చాపి దాంట్లో ఆహారాన్ని నెమలికి అందిస్తుంది. ఆ నెమలి కూడా పెంపుడు జంతువులాగా.. ప్రశాంతంగా ఆమె పెడుతున్న గింజల్ని తినేస్తుంది. ఇది పాత వైరల్ వీడియో... దీని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ షేర్ చేశారు.

ఈ వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ఇది పాత వీడియోనే.. ఇందులో ఏం విశేషముంది అని మీకు అనిపించవచ్చు. అంతేకాదు ఓ మహిళ పక్షికి ఆహారం పెడుతుంది. మహిళలు, పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం సాధారణ విషయమే కదా అనిపిస్తుంది. కానీ ఈ వీడియోను చూస్తే మీ మనసులో కదలిక మొదలవుతుంది. కూరగాయలమ్మే మహిళ తనకున్నదాంట్లో ఓ పక్షి ఆకలిని గుర్తించి, దానికి ఆహారాన్ని ఇవ్వడం.. అది కూడా ఎంతో నమ్మకంగా ఆమెకు మచ్చిక కావడం.. మనుషులు మూగజీవాల మధ్య ఉండే అనుబంధాన్ని పట్టిస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు. 

ఇదే ఇంక్రిడిబుల్ ఇండియా.. మానవత్వం మేల్కొలిపే ఘటన ఇది అని కూడా అన్నారు. అంతేకాదు ఈ 56 సెకన్ల వీడియోలో ఓ మహిళ పేవ్ మెంట్ మీద కూరగాయలమ్ముతూ ఉంటుంది. ఆమె చుట్టూ కూరగాయల బుట్టలు కనిపిస్తాయి. నెమలి ఆమె దగ్గరికి వచ్చి కూ.. కూ.. అంటుంది. ఆమె ఆకలిని గుర్తించిన ఆ మహిళ దానికి తన దగ్గరున్న గింజల్ని అరచేతిలో అందిస్తుంది. అది ప్రశాంతంగా తింటుంది.. చూడండి అంటూ వీడియో లింక్ ను షేర్ చేశారు. 

ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియో 28 వేలకు పైగా లైక్‌లు, అనేక రీట్వీట్‌లతో 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కూరగాయలమ్మే మహిళ.. ఇది చాలా సాధారణం అన్నట్టుగా తినిపిస్తుండడం.. నెమలి కూడా అంతే సాధారణంగా తినేస్తుండడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 

ఆ మహిళ భారత మాత.. ఆమె జాతీయ పక్షికి ఆహారం అందిస్తుంది.. అంటూ భావోద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. మరొకరు, "సర్, గుడ్ మార్నింగ్.. ఈ వీడియో నా రోజును ఎంతో ప్రభావితం చేసింది. ఇలాంటి వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు.. అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటివే అనేక రకాల కామెంట్స్ వీడియోలో కనిపించాయి. 

ఈ వీడియో రాజస్థాన్‌కు చెందినదని చాలామంది యూజర్స్ భావిస్తున్నారు. ఒకతను స్పందిస్తూ ‘ఈ వీడియో రాజస్థాన్‌లోని ఒక ప్రాంతం. వీడియోలో ఉన్న మహిళ, వీడియో తీస్తున్న మరో వ్యక్తి.. మార్వాడి భాష మాట్లాడుతున్నారు. రాజస్థాన్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. అక్కడ నెమళ్లు పెద్దవారిని సులభంగా నమ్మేస్తాయి. వారు క్రమం తప్పకుండా వాటికి ఆహారాన్ని అందిస్తుంటారు. అందుకే వారిని అవి విశ్వసిస్తాయి. అని చెప్పుకొచ్చారు. 

click me!