ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఓటమి చవి చూడడం ఒకెత్తయితే, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలవ్వడం మరో ఎత్తు. ఢిల్లీని సుదీర్ఘంగా పాలించిన షీలా దీక్షిత్‌ను ఓడించిన కేజ్రీవాల్ ఇప్పుడు స్వయంగా ఆయనే ఓటమి చవిచూడడం రాజకీయాల్లో ఏదైనా జరుగుతందని చెప్పడానికి సాక్ష్యంగా నిలిచింది.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. అవినీతి ఆరోపణలు, జైలుకు వెళ్లిరావడం, ఎన్నికల ముందు కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఇలా ఎన్నో అంశాలు ఆయన ఓటమికి కారణాలయ్యాయి.