2015లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ
గతంలో ఆప్ 2015 ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2015లో కేవలం మూడు సీట్లు, 2020లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది. 2020లో ఆప్, బీజేపీ మధ్య ఓట్ల వాటా అంతరం 15 శాతంగా ఉంది. ఆదాయపు పన్ను రాయితీ పెంపు, మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీలతో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడం ద్వారా ఢిల్లీలో బీజేపీ ప్రభంజనం కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీలో ఓటమిపాలైన తర్వాత ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నామనీ, ప్రజల మార్పు తీర్పునకు అనుగునంగా పాలన సాగించాలని కోరుతూ బీజేపీ శుభాకాంక్షలు తెలిపారు.
"ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు ప్రకటించారు. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాము. ప్రజల నిర్ణయం అత్యంత ముఖ్యమైనది. బీజేపీ విజయం సాధించినందుకు నేను అభినందిస్తున్నాను. అది వారికి మెజారిటీ ఇచ్చిన ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను" అని కేజ్రీవాల్ అన్నారు.