అనంత్, రాధిక పెళ్లిలో నీతా అంబానీ చేతిలో ఆసక్తికర దీపం ... ఎందుకంత స్పెషలో తెలుసా...?

Published : Jul 13, 2024, 02:55 PM ISTUpdated : Jul 15, 2024, 11:19 PM IST

ప్రపంచ కుభేరులు అంబానీల ఇంట అట్టహాసంగా వివాహ మహోత్సవం జరిగింది. ఈ వేడుకలో నీతా అంబానీ చేతిలో ఓ ఆసక్తికరమైన వస్తువు కనిపించింది. అయితే అంబానీల పెళ్లిలో ఈ  వస్తువు చాలా ప్రత్యేకమైనది...ఇంతకూ ఏమిటిది? 

PREV
15
అనంత్, రాధిక పెళ్లిలో నీతా అంబానీ చేతిలో ఆసక్తికర దీపం ... ఎందుకంత స్పెషలో తెలుసా...?
Anant Ambani Radhika Wedding

ముంబై : ఇండియాలోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీ ఇంట వివాహమంటే మామూలుగా వుంటుందా... ఆకాశమే పందిరిగా, భూలోకమే పెళ్లి పీటలుగా వేసారా అన్నట్లుగా ఏర్పాట్లు వుంటాయి. ఇక కోట్లాది మంది అభిమానించే సినీతారలు, క్రీడాకారులు... ఆదర్శంగా తీసుకునే వ్యాపారవేత్తలు... దేశాన్ని పాలించేవారు... ఇలా ఒక్కరేమిటి అన్నిరంగాల ప్రముఖులంతా ఆ పెళ్లిలోనే కనిపిస్తారు. గానా భజానా, పసందైన విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వర్ణనను చూసి మీకు ఇప్పటికే అర్థమైవుంటుంది ఎవరి పెళ్లి గురించి చెబుతున్నామో... అవును... అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లి గురించే.  

25
Anant Ambani Radhika Wedding

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని చిన్న కుమారుడు అనంత్ అంబాని వివాహం వ్యాపార కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ తో జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ వివాహవేడుకకు వేదికయ్యింది. ఈ పెళ్లి వేడుకలో అంబానీ కుటుంబమంతా సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా ఈ వయసులో ట్రెడిషన్ గా కనిపిస్తూనే పడుచు అమ్మాయిలతో పోటీపడితున్నారేమో అనే అందంతో మెరిసిపోతారు నీతా అంబాని.

35
Anant Ambani Radhika Wedding

కొడుకు అనంత్ పెళ్లిలోనూ సరికొత్తగా కనిపించారు నీతా అంబాని. అయితే ఈ పెళ్లిలో నీతా అంబాని చేతిలో గణనాథుడి ఫోటో, దీపంతో కూడిన ఓ విచిత్రమైన వస్తువుతో కనిపించారు. ఇదేంటో చాలామందికి తెలియదు. కాబట్టి అసలు ఇదేంటి..? నీతా అంబానీ చేతిలో ఎందుకుంది..?  పెళ్లి వేడుకలో దీని ప్రత్యేకత ఏమిటి..? అనేది తెలుసుకుందాం. 
 

45
Anant Ambani Radhika Wedding

అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో నీతా అంబానీ చేతిలో కనిపించింది గుజరాతీ పెళ్లిల్లో కనిపించే సాంప్రదాయ వస్తువు. దీనిని రామన్ దివో అంటారు... దీనికి గుజరాతీల పెళ్లిలో ప్రత్యేక స్థానం వుంది. పెళ్లికొడుకును మండపంలోకి తీసుకువచ్చే సమయంలో అతడి తల్లి దీన్ని పట్టుకుని ముందు నడుస్తారు. ఇలా కొడుకు అంబాని పెళ్ళిలో ఈ దీపం నీతా అంబానీ చేతిలో కనిపించింది.  
 

55
Anant Ambani Radhika Wedding

ఈ రామన్ దివోను గుజరాతీలు శుభప్రదంగా భావిస్తారు. పెళ్ళి బంధంతో నూతన జీవితాన్ని ప్రారంభించే దంపతులకు ఆశీర్వాదం అందిస్తుందని విశ్వసిస్తారు. వీరి జీవితంలో చీకటిని పారదోలి కొత్త వెలుగులు నింపేదిగా రామన్ దివోను భావిస్తారు. అందువల్లే సాంప్రదాయ గుజరాతీ పెళ్లిళ్లలో ఇది తప్పకుండా కనిపిస్తుంది. 
 

click me!

Recommended Stories