
Anant Ambani Radhika Merchant Wedding : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. అలాంటి అపర కుభేరుడి ఇంట పెళ్లంటే మామూలుగా వుటుందా... ఆకాశమే పందిరిగా, భూలోకమే పెళ్లి పీటలుగా మారిపోతాయి. ఇలా ముఖేష్, నీతాల చిన్న కొడుకు అనంత్ అంబానీ అట్టహాసంగా జరిగింది. తాను ఇష్టపడ్డ రాధికా మర్చంట్ ను మూడుముళ్ల బంధంతో జీవితంలోకి ఆహ్వానించారు అనంత్.
సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల సెలబ్రేటీల మధ్య అనంత్, రాధిక వివాహం జరిగింది. యావత్ దేశమే కాదు అంతర్జాతీయ సమాజం దృష్టిని కూడా ఆకర్షించిన ఈ పెళ్లికి ఆర్థిక రాజధాని ముంబై వేదికయ్యింది. గత రాత్రి(శుక్రవారం) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగవైభవంగా జరిగింది.
భారత సినీ ప్రముుఖులతో పాటు హాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు అనంత్, రాధిక పెళ్లిలో మెరిసారు. అలాగే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక దేశంలోని టాప్ వ్యాపారవేత్తలంతా ఈ పెళ్లిలో కనిపించారు. ఇలా అంబానీ కుటుంబంతో పాటు అన్నిరంగాలకు చెందిన ప్రముఖుల మధ్య అనంత్,రాధిక పెళ్లి జరిగింది.
ఎంతో అట్టహాసంగా నిర్వహించిన అనంత్, రాధిక పెళ్లికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా..? అక్షరాలా ఐదువేల కోట్లు... అవును మీరు వింటున్నది నిజమే. ఈ ఏడాది మార్చిలో ప్రీ వెడ్డింగ్ వేడుకలతో ప్రారంభమైన ఈ పెళ్లి తంతు వదువు మెడలో మూడు ముళ్ళు పడ్డాక కూడా పూర్తికాలేదు. రేపు అంటే జూలై 14న మళ్ళీ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేసారు. ఇలా ప్రీ వెడ్డింగ్ నుండి రేపటి రిసెప్షన్ వరకు అంబానీ కుటుంబం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
ఇలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్, రాధిక మర్చంట్ పెళ్లి చరిత్రలో నిలిచిపోనుంది. అయితే ఈ పెళ్లికి ఐదువేల కోట్లు ఎలా ఖర్చు చేసారు..? దేనికి ఎంత ఖర్చయ్యిందో తెలుసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ పెళ్లి ఖర్చులపై ఓ లుక్కేద్దామా.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (జామ్ నగర్) :
గుజరాత్ లోని జామ్ నగర్ అంబానీల స్వస్థలం. దీంతో తన చిన్నకొడుకు పెళ్లి వేడుకలను అక్కడినుండే ప్రారంభించారు ముఖేష్ అంబానీ. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా దేశం మొత్తం జామ్ నగర్ పేరు మారుమోగింది. జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక కోసమే అంబానీ కుటుంబం దాదాపు రూ.1200 కోట్లు ఖర్చు పెట్టింది. కళ్లు చెదిరే డెకరేషన్స్, నోరూరించే వందలాది వంటకాలతో దేశమే నివ్వెరపోయేలా ప్రీ వెడ్డింగ్ నిర్వహించారు.
జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ కు బిల్ గేట్స్, ఇవాంక ట్రంప్, మార్క్ జుకెన్ బర్గ్ వంటి ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యారు. ఇక భారతీయ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ ధరించిన పచ్చరాళ్ల డైమండ్ నెక్లస్ ఖరీదే రూ.500 కోట్లు వుంటుందట. దీన్నిబట్టే అనంత్, రాధిక పెళ్ల్ళి ఖర్చు ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.
యురోప్ లో క్రూయిజ్ లో రెండో ప్రీ వెడ్డింగ్ :
ఈ ఏడాది మార్చిలో భారత్ లో ప్రీ వెడ్డింగ్ ముగిసిన తర్వత అనంత్, రాధిక దంపతుల రెండో ప్రీ వెడ్డింగ్ యూరప్ లో జరిగింది. మే 29న ఇటలీలో ప్రారంభమైన క్రూయిజ్ పార్టీ జూన్ 1న ప్రాన్స్ లో ముగిసింది. ఈ వేడుకకోసం ఉపయోగించిన క్రూయిజ్ కోసమే ఏకంగా రూ.1,253 కోట్లు ఖర్చు చేసింది అంబానీ కుటుంబం.
ఇక ఈ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన అమెరికన్ సింగర్ కే కేటి పెర్రికి రూ.45 కోట్ల వరకు ముట్టజెప్పిందట అంబానీ కుటుంబం. ఇక మరో పాప్ సింగర్ షకీరా కూడా ప్రదర్శన ఇచ్చారు... ఆమెకు రూ.15 కోట్ల వరకు ఇచ్చారు. బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ప్రదర్శనకు రూ.5 నుండి 7 కోట్ల వరకు ఇచ్చారట. ఇంకా అనేక ప్రదర్శనలకు, అతిథుల కోసం చేసిన ఏర్పాట్లకు వందల కోట్లు ఖర్చే చేసింది అంబానీ కుటుంబం.
అనంత్, రాధిక సంగీత్ పంక్షన్ :
అనంత్, రాధిక పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు అతిథులు కూడా ఆడిపాడారు. ఈ సంగీత్ వేడుకలో కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బిబర్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ఇందుకుగాను జస్టిన్ కు రూ.83.53 కోట్లు ఇచ్చిందట అంబానీ కుటుంబం.
అనంత్, రాధిక పెళ్లి ఖర్చు :
అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లి ముంబై లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. అయితే ఈ పెళ్ళి కోసం అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్-2000 జెట్స్ అద్దెకు తీసుకుంది. అలాగే వందకు పైగా ప్రైవేట్ విమానాలను ఈ పెళ్లి కోసం ఉపయోగించారు.
ఈ పెళ్లి కోసం అంబానీల నివాసం ఆంటిలియాను సుందరంగా డెకరేట్ చేసారు. అలాగే పెళ్లి జరిగే జియో కన్వెన్షన్ సెంటర్ ను ప్రత్యేకంగా అలంకరించారు. అతిథుల కోసం 3 వేల రకాల వంటకాలను రెడీ చేసారు. మొత్తంగా కేవలం ఈ మూడురోజులు జరిగే సంగీత్,పెళ్లి, రిసెప్షన్ కోసమే రూ.2,600 కోట్లను ముఖేష్ అంబానీ ఖర్చు చేస్తున్నారట. ఇలా ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ ఖర్చు కలిపితే రూ.5 వేల కోట్లు అవుతోంది.