అమ్మాయిలకు రూ.2 కోట్లు ఫ్రీగా ఇస్తున్న మోడీ ప్రభుత్వం

Published : Feb 01, 2025, 02:29 PM ISTUpdated : Feb 01, 2025, 03:46 PM IST

Budget 2025: బడ్జెట్ 2025-26 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పలు పథకాలు ప్రకటించారు. వ్యాపారం చేస్తామంటే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రెండు కోట్ల వరకు రుణాలు అందించే టర్మ్ లోన్ పథకం తీసుకువచ్చారు.  

PREV
15
అమ్మాయిలకు రూ.2 కోట్లు ఫ్రీగా ఇస్తున్న మోడీ ప్రభుత్వం

Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 8వ సారి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా 2025-26 పద్దుకు సంబంధించి ఐదు లక్ష్యాలను ఆమె ప్రస్తావించారు. 

ఇందులో వృద్ధిని పెంచడం, సమ్మిలిత ప్రగతి, ప్రయివేటు సెక్టారులో పెట్టుబడులు మరింతగా పెంచడం, హౌస్ హోల్డ్ సెంటిమెంట్ పెంచడం, దేశంలో మధ్య తరగతి వారి స్పెండింగ్ ను పెంచడం అంశాలు ఉన్నాయి. 

25

పలు కొత్త పథకాలతో నిర్మలమ్మ బడ్జెట్ 2025-26

కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న సమయంలో పార్లమెంట్ లో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు ప్రయాగ్ రాజ్ కుంభమేళా 2025లో చోటుచేసుకున్న తొక్కిసలాటను ప్రస్తావిస్తూ చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనల మధ్యనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగు ప్రముఖ అభ్యుదయ కవి గురజాడ అప్పరావు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. వ్యాపారం చేయాలనుకునే మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా రెండు కోట్ల రూపాయల రుణాలు అందిస్తామని చెప్పారు.

35

ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకం 

కేంద్ర బడ్జెట్ 2025-26 లో షెడ్యూల్ కులాలు, తెగల మహిళలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి రెండు కోట్ల వరకు రుణాలు అందిస్తామని తీపికబురు అందించారు. తొలిసారి సొంత వ్యాపారాలు  ప్రారంభించే వారితో పాటు ఉన్న వాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేండ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలు అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ టర్మ్ లోన్ పథకంతో దేశంలో మొత్తం 5 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.  

45

స్టాండప్ ఇండియా పథకం నుంచి వ‌చ్చిన కొత్త ప‌థ‌కం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. 5 లక్షల మంది మహిళా ఎస్సీ/ఎస్టీ  తొలిసారి పారిశ్రామికవేత్తల (First-time entrepreneurs) కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకు టర్మ్ లోన్లను అందిస్తుంది. ఇది విజయవంతమైన స్టాండప్ ఇండియా పథకం నుండి వ‌చ్చింద‌ని తెలిపారు. 

వ్యవస్థాపకుల నైపుణ్యాలను పెంపొందించడానికి వ్యవస్థాపకత, నిర్వాహక నిపుణుల కోసం ఆన్‌లైన్ కెపాసిటీ బిల్డింగ్ నిర్వహించబడుతుందని నిర్మ‌ల‌మ్మ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి జ‌రుగుతుంద‌నీ, ఈ పథకం ఆర్థిక వ్యవస్థలో మహిళలు, అట్టడుగు వర్గాలను కలుపుకొని పోవడాన్ని పెంచుతుందని చెప్పారు. 

55

ఆర్థిక వృద్ధిపై టర్మ్ లోన్ పథకం ప్రభావం ఎలా ఉండ‌నుంది? 

మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం తీసుకువ‌చ్చిన టర్మ్ లోన్ పథకంతో మహిళలు-నేతృత్వంలోని మరిన్ని వ్యాపారాలు అంటే కుటుంబాలు, కమ్యూనిటీలలో మహిళలకు ఎక్కువ ఆర్థిక స్వాతంత్య్రం వైపు న‌డిపిస్తూ మెరుగైన నిర్ణయాధికారం క‌ల్పిస్తుంద‌న్నారు. 

ఈ పథకం ఆర్థిక సహాయంతో SC, ST వ్యాపార వ్యవస్థాపకులు విజయవంతమైన వ్యాపారాలను స్థాపించడానికి సమాన అవకాశాలను కలిగి ఉంటారు, ఆర్థిక అసమానతలను తగ్గించడంలో కూడా ఉపయోగపడనుంది. ఈ వ్యాపారవేత్తలలో చాలా మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వ్యాపారాలను ఏర్పాటు చేస్తారు, ఇది స్థానిక ఉద్యోగ సృష్టి, ఆర్థిక పునరుజ్జీవనానికి దారి తీస్తుంది. అనువైన షరతులతో కూడిన టర్మ్ లోన్ల లభ్యత, అనేక కొత్త వ్యాపార యజమానులకు కీలకమైన అడ్డంకి అయిన మూలధన పెట్టుబడి సవాళ్లను అధిగమించడంలో కీలక పాత్ర పోషించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories