Nita Ambani - raman divo : ఆసియాలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ డికేడ్ లో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు సృష్టించింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు అనేక మంది ప్రపంచ ప్రముఖులు విచ్చేశారు.
ఈ వివాహ వేడుకలో అంబానీ కుటుంబం మొత్తం సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. ముఖ్యంగా 60 ఏళ్ల వయసులోనూ నేటితరం అమ్మాయిలో పోటీగా అందంతో మెరిసింది నీతా అంబానీ.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహంలో నీతా అంబానీ ఒక వస్తువును పట్టుకుని కనపించారు. ఈ వివాహం పూర్తి అయ్యే వరకు ఆమె చేతిలో ఇది కనిపించింది. నీతా అంబానీ చేతిలోని ఈ విచిత్రమైన వస్తువుకు వినాయకుడి బొమ్మను చోడించి ఉంది. అలాగే, విగ్రహం ముందు దీపం కూడా ఉంది.
ముఖేష్ అంబానీ తన కొడుకు ఆనంత్ అంబానీని మ్యారేజ్ హాల్‌కు తీసుకువస్తున్న సమయంలో నీతా అంబానీ తన చేతిలో ఈ ప్రత్యేకమైన వస్తువును పట్టుకుని అందరికంటే ముందుకు నడుస్తు కనిపించారు.
దీంతో నీతా అంబానీ పట్టుకున్న వస్తువు ఏమిటీ? ఎందుకు వివాహం పూర్తి అయ్యేవరకు పట్టుకున్నారు? ఆ వస్తువుకున్న ప్రత్యేకత ఏమిటీ? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
నీతా అంబానీ తన కొడుకు చేయి పట్టుకుని పెళ్లి జరిపించడం గుజరాతీ పెళ్లిళ్లలో కనిపించే సంప్రదాయం. అలాగే, వినాయకుడి ప్రతిమ, ముందు దీపంతో కూడిన ఇలాంటి ప్రత్యేకమైన వస్తువును పట్టుకుని పెళ్లిళ్లు చేయడం గుజరాతీ ప్రజలు శుభప్రదంగా భావిస్తారు. దీనిని 'రామన్ డివో' అంటారు.
ఇది కొత్త జీవితాన్ని ప్రారంభించే జంటలను ఆశీర్వదించి, చీకటిని తొలగించి, వారి జీవితాలను కొత్త కాంతితో నింపుతుందని నమ్ముతారు. సాంప్రదాయ గుజరాతీ వివాహాలలో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలో చాలా సమయం చేతిలో పట్టుకుని కనిపించారు.