అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం 10,000 రూపాయలతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆ రోజులలో ఒక మహిళ వ్యాపారం చేయడం అంటే అంతే తేలికైన విషయం కాదు. కానీ అలాంటి పరిస్థితులకు ఎదురు నిలబడి ప్రకృతి హెర్బల్స్ అనే సంస్థని ప్రారంభించింది. వ్యాపారంలో దిగటానికి ముందు చర్మ సౌందర్యానికి జుట్టు సంరక్షణకు సంబంధించిన సుదీర్ఘ పరిశోధనల అనంతరం తన వ్యాపారాన్ని కేవలం 10,000 రూపాయలతో తన స్నేహితురాలతో కలిపి ప్రారంభించింది నీతా అడప్పా.