కాలేజీకి చెందిన ఓ విద్యార్థి కిటికీ వెనుక నుంచి ఈ వీడియో తీశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుచిత్రానాయక్ తెలిపారు. అలాంటి ప్రవర్తనను సహించబోమని, సీనియర్ విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
"అతను ఎన్‌సిసి విద్యార్థి. ఈ ఘటన మీద చర్య తప్పనిసరిగా తీసుకుంటాం. అయితే ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... ఇక్కడ ఎన్‌సిసి ద్వారా చాలా మంచి పని జరిగింది. అది కూడా చెప్పాలనుకుంటున్నాను" అని ఆమె అన్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ ఎన్‌సీసీ శిక్షణ జరుగుతోందని.. టీచర్ లేని సమయంలో ఈ ఘటన జరిగిందని.. ఆ విద్యార్థి చేసిన పని కేవలం మానసిక రోగులు మాత్రమే చేయగలరని ఈ చర్య చూస్తే అర్థమవుతోందని ప్రిన్సిపాల్ తెలిపారు.