అంతకుమందుకు ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. ప్రజలు కూడా పూల వర్షం కురిపిస్తూ మోదీకి ఘన స్వాగతం చెప్పారు. మోదీ మోదీ, హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు. తొలుత ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.