Omicron : ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఒమిక్రాన్ కేసు.. దేశవ్యాప్తంగా 38కి చేరుకున్న సంఖ్య..

First Published | Dec 13, 2021, 7:55 AM IST

భారతదేశంలో ఓమిక్రాన్ కేసులు : తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ మొదటి కేసు నమోదయ్యింది. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తో సహా ఇంకొన్ని రాష్ట్రాల్లో కొత్త COVID-19 వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

omicron

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ అనేక దేశాలకు తన ఉనికిని విస్తరిస్తోంది. భారత్ లో నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ మొదటి కేసు నమోదయ్యింది. చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున ఐదు తాజా కేసులు వెలుగులోకి రావడంతో భారతదేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య 38కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు చండీగఢ్‌లోనూ ఇవే మొదటి కేసులు.

omicron

దీనికి సంబంధించిన పది ముఖ్యమైన అంశాలు.. 

దక్షిణాఫ్రికా నుండి ఢిల్లీ మీదుగా తిరిగి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తి -- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓమిక్రాన్ మొదటి కేసు నమోదైంది. అతనికి డిసెంబర్ 6 న విమానాశ్రయంలో పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కరోనా అనుమానంతో పరీక్షలు చేసి.. అతని నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి genome test కు పంపగా, ఆ ఫలితాలు ఈ రోజు వచ్చాయి. 

ఇది మహారాష్ట్ర 18వ ఓమిక్రాన్ కేసు. వైరస్‌కు బ్రేక్‌లు వేయడానికి, డిసెంబర్ 11, 12 తేదీలలో ముంబైలో large gatheringsలను నిషేధిస్తూ నిషేధాజ్ఞలు ప్రకటించారు.


కేరళలోని ఎర్నాకులంలో ఉన్న రోగి UK నుండి అబుదాబి మీదుగా వచ్చాడు. ఇతనికి డిసెంబర్ 8 న పాజిటివ్ గా తేలింది. అతని భార్య, తల్లికి కూడా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ ముగ్గురూ ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో వీరితో పాటు విమానంలోని మొత్తం 149 మంది ప్రయాణికులను గుర్తించి వారికి సమాచారం అందించినట్లు కేరళ అధికారులు తెలిపారు.

చండీగఢ్‌లోని తన బంధువులను చూసేందుకు ఇటలీ నుంచి వచ్చిన 20 ఏళ్ల యువకుడికి ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. నవంబర్ 22న ల్యాండ్ అయిన తర్వాత, అతను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు డిసెంబరు 1న తిరిగి పరీక్షించినప్పుడు కోవిడ్‌కు పాజిటివ్ అని తేలింది. అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపగా ఓమిక్రాన్‌ గా నిర్ధారణ అయ్యింది.

asymptomatic అయిన ఓ వ్యక్తి ఇటలీలో ఉన్నప్పుడు ఫైజర్ వ్యాక్సిన్‌తో రెండు డోసుల టీకాలు వేయించుకున్నాడు. ప్రస్తుతం ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉన్నాడు. అతని ఏడుగురు హై-రిస్క్ ఫ్యామిలీ కాంటాక్ట్‌లను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. వారికి ఈరోజు మరోసారి పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో, ఐర్లాండ్ నుండి తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి ఓమిక్రాన్ స్ట్రెయిన్‌కు పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా తాజాగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలను రేకెత్తించింది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఉన్నారు.

ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తో సహా అనేక రాష్ట్రాలు కొత్త COVID-19 వేరియంట్ కేసులను నివేదించాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
అస్సాంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఓమిక్రాన్‌ను రెండు గంటల్లో గుర్తించగల కొత్త టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది. విమానాశ్రయాల్లో పరీక్ష నివేదికల కోసం నిరీక్షణ సమయం పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇది ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.

omicron

గత వారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంచాలని, వారి ప్రజలకు పూర్తిగా టీకాలు వేయాలని హెచ్చరించింది.

ఓమిక్రాన్ జాతి, "highly transmissible" అని చెప్పబడింది, కనీసం 59 దేశాలకు వ్యాపించింది. UK, డెన్మార్క్, దక్షిణాఫ్రికా అత్యధిక సంఖ్యలో Omicron కేసులు ఉన్న మొదటి మూడు దేశాలు.
 

Latest Videos

click me!