Riya Ahir: వర్షంలో పోలీస్ వ్యాన్‌కు అడ్డంగా నిలబడ్డ పిల్ల.. ఇప్పుడు సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే?

Published : Aug 20, 2026, 02:16 PM IST

Riya Ahir: ముంబై జెన్ జీ నిరసనల ఫేస్ రియా అహిర్ కమెంట్స్ వైరల్ గా మారాయి. జెన్ జీ ఆందోళనలో పాపులర్ అయిన రియా అహిర్ తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఆన్‌లైన్ బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ను కోరింది.

PREV
15
ముంబై జెన్ జీ ప్రాటెస్ట్ ఫేస్ రియా అహిర్ సంచలన కామెంట్స్

ముంబైలో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ రియా అహిర్, ఇప్పుడు పోలీసులను ఒక విజ్ఞప్తి చేసి వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులు, నీచమైన కామెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులను కోరింది.

25
పోలీస్ వ్యాన్‌ను అడ్డుకుని వార్తల్లోకి..

జూలై 22న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో వర్షంలో జరిగిన నిరసన మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో అరెస్ట్ చేసిన నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ ముందుకు వచ్చి, గ్రే కలర్ హూడీతో గట్టిగా నిలబడిన రియా అహిర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఒక్కసారిగా ఈ జెన్ జీ ప్రొటెస్ట్‌కు ముఖచిత్రంగా మారింది.

35
యూత్ కాంగ్రెస్ డెలిగేషన్ భేటీ

ఈ వివాదంపై ముంబై యూత్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ శర్మను కలిసి మాట్లాడింది. రియా అహిర్‌పై వేసిన ఎఫ్‌ఐఆర్, ఆమె ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధి బృందంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హర్గున్ సింగ్, ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ శబ్రీన్ ఉన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని, మరి ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని హర్గున్ సింగ్ ప్రశ్నించారు.

45
హామీ ఇచ్చిన జాయింట్ కమిషనర్

యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, రియాపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జాయింట్ సీపీ మనోజ్ శర్మ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రియాకు సోషల్ మీడియా లో బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్న అకౌంట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

కనీసం పట్టించుకోలేదన్న రియా

జాయింట్ సీపీతో సమావేశం తర్వాత రియా అహిర్ మాట్లాడుతూ.. తన నిరసన వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. తనతో పాటు నిరసనలో పాల్గొన్న 19 ఏళ్ల ముస్కాన్ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన కామెంట్స్, బెదిరింపులను ఎదుర్కొంటోందని రియా వెల్లడించింది.

55
హక్కులు కోరితే శిక్షిస్తారా?

యువతులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసినందుకే వారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని యూత్ కాంగ్రెస్ నాయకురాలు జీనత్ శబ్రీన్ అన్నారు. ఆన్‌లైన్ వేధింపులకు, భయాందోళనలకు గురిచేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories