ఇంట్లో దోమ‌లుంటే జ‌రిమానా చెల్లించాల్సిందే.. ఇలాంటి నిబంధ‌న‌ ఉంద‌ని మీకు తెలుసా?

Published : Aug 19, 2025, 04:15 PM IST

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దీంతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. దీనిని నియంత్రించేందుకు మున్సిపల్ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. ఇలాంటి ఒక చర్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
14
వర్షాకాలంలో దోమల సమస్య

వర్షాకాలం రాగానే ఇళ్లలో, కాలనీల్లో నీరు నిలిచిపోతుంది. ఈ నీరు కూలర్లు, బకెట్లు, టైర్లు లేదా పాత పాత్రల్లో నిల్వ ఉంటే అవి దోమలు పెరగడానికి అడ్డాగా మారుతుంది. ఒక చిన్న పాత్రలో ఉన్న నీటిలోనూ వందలాది దోమలు పుట్టగలవు. ఈ పరిస్థితుల్లో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే ప్రజలకు పరిశుభ్రత పాటించాలని, ఇంట్లో నీరు నిల్వ ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తుంటారు.

DID YOU KNOW ?
50 సంవత్సరాల నాటి వ్యవస్థ
ఇంటి యజమానులపై జరిమానా విధించే ఈ విధానం కొత్తది కాదు. ఢిల్లీలో తొలిసారి 1975లోనే ఈ నిబంధనను ప్రవేశపెట్టారు
24
మున్సిపల్ సంస్థల జరిమానా నియమాలు

దోమల ఉత్పత్తి ప్రదేశాలను నియంత్రించేందుకు భారతదేశంలోని అనేక మున్సిపల్ కార్పొరేషన్లు కఠినమైన నియమాలు అమలు చేస్తున్నాయి. అధికారులు ఇంటి తనిఖీల్లో దోమల లార్వాను గుర్తిస్తే, ఇంటి యజమానికి జరిమానా విధిస్తారు. ఈ మొత్తం నగరానికి నగరానికి మారుతుంది. ఉదాహరణకు ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో రూ.500 నుంచి రూ.5,000 వరకు జరిమానా వసూలు చేస్తారు. అదే వాణిజ్య సంస్థల్లో దోమల పెంపక స్థలాలు కనపడితే మరింత ఎక్కువగా రుసుము వసూలు చేస్తారు.

34
50 సంవత్సరాల నాటి వ్యవస్థ

ఇంటి యజమానులపై జరిమానా విధించే ఈ విధానం కొత్తది కాదు. ఢిల్లీలో తొలిసారి 1975లోనే ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. అప్పట్లో గరిష్టంగా రూ.500 వరకు జరిమానా విధించేలా చట్టం రూపొందించారు. ఆ తరువాత కాలక్రమేణా డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు పెరుగుతుండటంతో జరిమానా మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో డెంగ్యూ దోమల లార్వాను గుర్తిస్తే రూ.2,000 వరకు జరిమానా విధిస్తున్నారు.

44
కఠినమైన తనిఖీలు

ఇటీవలి కాలంలో మున్సిపల్ బృందాలు మరింత కఠినతరంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇళ్లు మాత్రమే కాకుండా పాఠశాలలు, కార్యాలయాలు, ఆసుపత్రుల్లో కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా దోమల లార్వా కనపడితే మొదట నోటీసు ఇస్తారు. సమస్య పరిష్కరించకపోతే వెంటనే జరిమానా విధిస్తారు. ఈ చర్యలతో పాటు, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories