మోదీ చేతిలో ఏమిటా దిష్టి బొమ్మ? ఈ బొమ్మకు మన దేశానికి ఉన్న అనుబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Published : Aug 29, 2025, 05:31 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ దారుమ బొమ్మను బహుమతిగా అందుకున్నారు. ఈ బొమ్మ ఎంతో ప్రత్యేకమైనది. దీనికి మన దేశానికి ఉన్న అనుబంధం ఏమిటో తెలుసుకోండి. 

PREV
14
జపాన్ పర్యటనలో మోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. మోడీ ఏ దేశానికి వెళ్లినా ప్రపంచం మొత్తం దృష్టి ఆదేశంపైనే ఉంటుంది. టోక్యోలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని గౌరవ వందనాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత దారుమాజీ ఆలయ ప్రధాన పూజారి మోడీకి జపనీస్ ప్రత్యేకమైన బొమ్మ దారుమాను బహూకరించారు. ఆ బొమ్మ చూసేందుకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో అందరి దృష్టి దానిపైనే పడింది. ఆ బొమ్మ ఏమిటో.. ఆ బొమ్మ వెనుక నమ్మకం ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్నఆసక్తి కలుగుతుంది.

24
దారుమా బొమ్మ ప్రత్యేకత

దారుమ బొమ్మ గురించి చెప్పాలంటే జపనీయులకు ఇది ఎంతో ఇష్టమైనది. వేల ఏళ్లుగా జపనీస్ సంస్కృతికి ఈ బొమ్మే చిహ్నంగా మారింది. ఇది అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఎక్కువగా ఇది ఎరుపు రంగు, తెలుపు రంగులోనే కనిపిస్తుంది. గుడ్డు ఆకారంలో బోలుగా ఉంటుంది. చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జపాన్ వెళ్తే దారుమా బొమ్మలు మీకు ఎక్కువగానే కనిపిస్తాయి

దారుమా బొమ్మకు ముఖం మాత్రమే ఉంటుంది. చేతులు కాళ్లు వంటివి ఏవీ ఉండవు. ఒక్కొక్కసారి దారుమా బొమ్మను డబ్బులు దాచుకునే పిగ్గీ బ్యాంకులాగా చేసి అమ్ముతారు. ఈ బొమ్మ జపనీస్ వారి సంస్కృతిలో బోధిధర్మను సూచిస్తుంది. బోధిధర్మను అక్కడ దారుమ అని కూడా అంటారు.

34
భారతదేశంతో దారుమకు అనుబంధం

ఈ దారుమ బొమ్మలకు భారతదేశంలో కూడా చిన్న అనుబంధం ఉంది. ఐదు లేదా ఆరవ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన బౌద్ధ సన్యాసి బోధిధర్మ చైనాకు వెళ్లారు. ఇతడు తమిళనాడు లేదా కేరళకు చెందిన వాడని నమ్ముతారు. అతడి ముఖ నమూనాను బట్టే ఈ దారుమ బొమ్మను తయారు చేశారని చెబుతారు. జపాన్లో జెన్ బౌద్ధమత స్థాపకుడిగా బోధిధర్మను చెప్పుకుంటారు. అతడినే దారుమ అని పిలుచుకుంటారు. అతని ప్రతిరూపమే ఈ దారుమ బొమ్మ అని జపాన్లో నమ్మకం ఉంది. ఈ బొమ్మలను పట్టుదలకు చిహ్నాలుగా చెబుతారు. బోధిధర్మకు ధ్యానం పట్ల ఉన్న అంకిత భావాన్ని ఈ బొమ్మలు సూచిస్తాయని అంటారు.

44
ఈ బొమ్మలు అదృష్టానికి చిహ్నాలు

జపాన్లో ఈ బొమ్మలను అదృష్ట తాయెత్తులుగా చెప్పుకుంటారు. 18వ శతాబ్దంలో రైతులు పంటల పండక ఇబ్బంది పడుతున్న సమయంలో... దురదృష్టం నుండి రక్షణ పొందాలని ఈ బొమ్మలను వేడుకున్నట్టు కథనాలు ఉన్నాయి. ఆ సంవత్సరం మంచి పంటలు పడ్డాయని చెబుతారు. అప్పటినుంచి దారుమ బొమ్మలను జపాన్ లో విపరీతంగా అమ్మడం మొదలుపెట్టారు. అందుకే జపాన్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రికి రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగాలని కోరుకుంటూ దారుమ బొమ్మను బహుమతిగా ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories