మొదట ఓ అమ్మాయి పెళ్ళాడాడు… తర్వాత ఆమె చెల్లిని పెళ్లాడాడు.. ఇప్పుడు మూడో చెల్లిని ప్రేమిస్తున్నా, పెళ్లిచేసుకుంటానంటూ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇదంతా విని వీడెవడండి బాబు..! అని అనిపిస్తుందా.
ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అయితే అతడు ప్రభుత్వం నుండి ఏ పథకం రాలేదనో... అప్పులు అయ్యాయి, తీర్చే మార్గం లేదనో... కుటుంబ కలహాల వలనో టవర్ ఎక్కి నిరసన తెలిపాడని అనుకుంటే పొరబడినట్లే... అతడి కోరిక వింటే జాలి కలగకపోగా వీడెవడండీ బాబు..! ఇలా ఉన్నాడని అనిపిస్తుంది. ఇంతకూ అతడి కోరిక ఏమిటి? ఎందుకోసం టవర్ ఎక్కాడో తెలుసుకుందాం.
25
రాజ్ మొదటి సంసారం...
ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ కు చెందిన రాజ్ సక్సేనా 2021 లో పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నాడు. కొంతకాలం ఈ దంపతుల సంసారం సాఫీగానే సాగింది... భార్యభర్తలిద్దరు ఆనందంగా జీవిస్తున్న సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. సడెన్ గా అనారోగ్యం పాలయిన రాజ్ భార్య మరణించింది. ఇలా పెళ్లయినా ఏడాదికే అతడు భార్యను కోల్పోయి ఒంటరివాడు అయ్యాడు.
35
రాజ్ రెండో సంసారం..
అల్లుడి పరిస్థితి చూసి చలించిపోయిన అత్తామామలు తమ రెండో కూతురిని రాజ్ కు ఇచ్చి పెళ్లిచేశారు. ఇలా మరదలిని పెళ్లాడిన అతడిలో మరో దుర్భుద్ది మొదలయ్యింది. తన భార్యల మూడో సోదరిపై కూడా అతడు మనసు పారేసుకున్నాడు.. బుద్దిగా రెండోభార్యతో సంసారం చేసుకోకుండా మరదలితో ప్రేమాయణం సాగించాడు. ఇంతటితో ఆగకుండా ఆమెను పెళ్లిచేసుకోవాలని భావించాడు.. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. భర్త మాటలు విని కంగుతిన్న ఆమె తన చెల్లిని పెళ్లాడేందుకు ఒప్పుకోలేదు. దీంతో రాజ్ సంసారాన్ని బైటపెట్టుకుని నానా హంగామా చేశాడు.
నిన్న (గురువారం) తన భార్యతో ''నీ చెల్లిని ప్రేమిస్తున్నాను... నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను'' అని చెప్పాడు రాజ్ సక్సేనా. కానీ అతడి భార్య అందుకు ఒప్పుకోలేదు.. దీంతో ఏం చేయాలో అర్థంకాక ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విద్యుత్ టవర్ ఎక్కి గ్రామస్తులు, పోలీసుల ముందే తన మరదలిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని... ఇందుకు భార్య అంగీకరించడంలేదని చెప్పాడు. దీంతో అతడికి ఏం చెప్పాలో ఎవరికీ అర్థంకాలేదు.
55
రాజ్ టవర్ ఎలా దిగాడో తెలుసా?
ఎంత చెప్పినా వినకపోవడంతో రాజ్ సక్సేనా కోరినట్లే మరదలితో పెళ్లి చేస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.. ఇందుకోసం అతడి భార్యను కూడా ఒప్పిస్తామని చెప్పారు. ఇలా పోలీసులు, కుటుంబసభ్యులు ఏడు గంటలపాటు అతడిని బుజ్జగించి, పెళ్లి చేస్తామని మాట ఇచ్చి కిందకి దింపారు.
కిందకు దిగినతర్వాత మీడియాతో మాట్లాడిన రాజ్ సక్సేనా తన భార్యతో పాటు ఆమె చెల్లి ఇద్దరూ తనని ప్రేమిస్తున్నారని... కాబట్టి ఇద్దరినీ బాగా చూసుకుంటానని చెప్పాడు. అయితే పోలీసులు అతడిని కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇతడి విచిత్రమైన డిమాండ్... ఇందుకోసం టవర్ ఎక్కి నిరసన తెలపడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది... నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.