ఏంటీ పరిస్థితి.. వారణాసిలో మోడీ వెనుకంజ... లీడ్‌లో రాహుల్‌

First Published | Jun 4, 2024, 10:14 AM IST

2014, 2019 లోక్ సభ ఎన్నికల కంటే ఈసారి బిజెపి సీట్ల సంఖ్య పెరుగుతుందని... ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం ఖాయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 

దేశమంతా ఎన్‌డీయే హవా కొనసాగుతోంది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిపోయారు. ఆ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమి నామమాత్రపు సీట్లకు పరిమితం అవుతుంటే.. రాహుల్‌ గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలి, వయనాడ్‌ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఈ ట్రెండ్‌ చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. అయితే.. ఈ ఫలితం చివరలో తారుమారు అవుతుందని, మోదీ దే విజయం అని  బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
 

ఈ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఒకసారి చూస్తే...

దేశవ్యాప్తంగా బిజెపి హవా కొనసాగుతూనే వుందని... ఈ లోక్ సభ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల కంటే ఈసారి బిజెపి సీట్ల సంఖ్య పెరుగుతుందని... ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం ఖాయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కొన్ని సంస్థల సర్వేలు అయితే ఎన్డిఏ కూటమి 400 సీట్లు కూడా దాటే అవకాశాలు వున్నాయంటున్నాయి. ఇదే జరిగితే ''అబ్ కీ బార్ - చార్ సౌ పార్'' అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బిజెపి అనుకున్నది సాధించినట్లే.  
 

Latest Videos


Modi and Rahul


మొత్తంగా ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ బిజెపి, ఎన్డిఏ కూటమికే ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. ఇండియా టివి-సిఎన్ ఎక్స్, జన్ కీ బాత్ సర్వేలు ఎన్డిఏకు 362-392 వరకు ఎంపీ సీట్లను గెల్చుకుంటాయని అంచనా వేస్తున్నాయి. ఇక రిపబ్లిక్ భారత్ 359,  ఇండియా న్యూస్- డి-డైనమిక్స్ 371, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 353-368, దైనిక్ భారత్ 281-350, న్యూస్ నేషన్ 342-378 సీట్లు ఎన్డిఏకు వస్తాయని చెబుతున్నాయి. 


మొత్తంగా ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ బిజెపి, ఎన్డిఏ కూటమికే ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. ఇండియా టివి-సిఎన్ ఎక్స్, జన్ కీ బాత్ సర్వేలు ఎన్డిఏకు 362-392 వరకు ఎంపీ సీట్లను గెల్చుకుంటాయని అంచనా వేస్తున్నాయి. ఇక రిపబ్లిక్ భారత్ 359,  ఇండియా న్యూస్- డి-డైనమిక్స్ 371, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 353-368, దైనిక్ భారత్ 281-350, న్యూస్ నేషన్ 342-378 సీట్లు ఎన్డిఏకు వస్తాయని చెబుతున్నాయి. 
 

narendra modi and rahul gandhi

ఇక మహారాష్ట్రలో బిజెపి బలం మరింత పెరిగిందని... అక్కడ అత్యధిక సీట్లు ఆపార్టీకే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ ఈసారి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచిందని... ఈ రాష్ట్రంలో బిజెపి అత్యధిక సీట్లు సాధిస్తుందట.  ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుండి బిజెపికి 22 మంది ఎంపీలుంటే ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత పెరగనుందని చాలా సర్వేలు చెబుతున్నాయి.

ఇక ఉత్తరాదిన ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎప్పటిలాగే బిజెపి హవా కొనసాగుతుందని సర్వేలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ల స్వరాష్ట్రం గుజరాత్ లో బిజెపి క్లీన్ స్వీప్ చేయనుందట. మిగిలిన రాష్ట్రాల్లోనూ బిజెపి, ఎన్డిఏ కూటమి పార్టీలకే అత్యధిక సీట్లు వస్తాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 
 

Ragul vs Modi

సర్వే సంస్థలు, పార్టీల వారిగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు :

ఎన్డి టివి :  ఎన్డిఏ 361 ‌- ఇండి కూటమి 145  - ఇతరులు 37 

ఏబిపి న్యూస్‌-సి ఓటర్ సర్వే : ఎన్డిఏ 353-383 ‌- ఇండి కూటమి 152-182 ‌‌- ఇతరులు 4-12

దైనిక్ భాస్కర్ : ఎన్డిఏ 281-350 - ఇండి కూటమి 145-201 ‌- ఇతరులు 33-49

ఇండియా న్యూస్-డి‌-డైనమిక్స్ : ఎన్డిఏ 371 ‌- ఇండి కూటమి 125 ‌ - ఇతరులు 47

ఇండియా టివి-సిఎన్ఎక్స్ : 371-401 - ఇండి కూటమి 109-139  -  ఇతరులు 28-38

జన్ కీ బాత్ : 362-392   ‌-  ఇండి కూటమి 141-161 ‌- ఇతరులు 10-20 

న్యూస్ నేషన్ : ఎన్డిఏ 342-378  ‌- ఇండి కూటమి 153-169  ‌- ఇతరులు 21-23

రిపబ్లిక్ టివి - మ్యాట్రిజ్ - ఎన్డిఏ 353-368 - ఇండి కూటమి 118-133  - ఇతరులు 43-48

టైమ్స్ నౌ- ఈటిజి : ఎన్డిఏ 358  ‌- ఇండి కూటమి 152 ‌- ఇతరులు 33
  
రిపబ్లిక్ టివి - పి మార్క్ - ఎన్డిఏ 359 - ఇండి కూటమి 154  - ఇతరులు

click me!