మోడీ 'లడక్' దెబ్బ : కాళ్లబేరానికి వచ్చిన చైనా

First Published Jul 3, 2020, 7:31 PM IST

చైనా  విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కి తగ్గదు అని చెబుతూ.... కృష్ణుడి ఉదాహరణతో సాదోహరణంగా వివరించారు. వీరత్వం, ధైర్యం శాంతిని నెలకొల్పడానికి అత్యావశ్యకాలు అని, బలహీనులు ఎన్నటికీ శాంతిని నెలకొల్పలేరు అని చెప్పారు. భారతీయులు వేణుమాధవుడిని పూజిస్తారు, సుదర్శన చక్రాన్ని ధరించి యుద్ధోన్ముఖుడైన కృష్ణుడిని కూడా పూజిస్తారని చెప్పారు నరేంద్రమోడీ. 

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆకస్మిక లెహ్ పర్యటనఒక్కసారిగా బార్డర్కి ఇరువైపులా కూడా సంచలనం సృష్టించింది. జూన్ 15న జరిగిన దుర్ఘటన తరువాత ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ అక్కడకు వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయన నీములోని పోస్ట్ వేదికగా చైనా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
undefined
సామ్రాజ్యవాద విస్తరణల కాలంగతించిందని, ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా విస్తరణ విధానానికి స్వస్తి పలికి అభివృద్ధి దిశగా, ఆరోగ్యకరమైన పోటీ ప్రపంచంలో నివసిస్తున్నారని ప్రధాని మోడీ చైనా విధానాలను తూర్పారబట్టారు. గత శతాబ్దంలో ఇలా సామ్రాజ్యవాద విధానాలను పాటిస్తూ, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించాలని ప్రయత్నించిన అనేక దేశాలు కాలగర్భంలో కలిసిపోవడమో, లేదా ఘోర అవమానాన్ని పొందడంలో జరిగాయి అని చైనా ను ఉద్దేశించి మోడీ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
undefined
చైనా విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కి తగ్గదు అని చెబుతూ.... కృష్ణుడి ఉదాహరణతో సాదోహరణంగా వివరించారు. వీరత్వం, ధైర్యం శాంతిని నెలకొల్పడానికి అత్యావశ్యకాలు అని, బలహీనులు ఎన్నటికీ శాంతిని నెలకొల్పలేరు అని చెప్పారు. భారతీయులు వేణుమాధవుడిని పూజిస్తారు, సుదర్శన చక్రాన్ని ధరించి యుద్ధోన్ముఖుడైన కృష్ణుడిని కూడా పూజిస్తారని చెప్పారు నరేంద్రమోడీ.
undefined
సరిహద్దుల్లోని మౌలికవసతులు, ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని, భారతదేశం భద్రతాబలగాలా ఆధునీకరణ విషయంలో మూడు రెట్లు వ్యయం పెంచిందని, బలవంతులు శాంతిని నెలకొల్పుగలుగుతారనే సిద్ధాంతాన్ని నమ్మి ఈ పెట్టుబడులు పెట్టడం జరిగిందని మోడీ అన్నారు.
undefined
సాహసం, విశ్వసనీయత, గౌరవం, నడవడిక, అనేవి ఏ సైన్యానికైనా అత్యవసరాలని తమిళ కవితిరువళ్ళువార్ వ్యాఖ్యలను ప్రస్తావించారు ప్రధాని. సైన్యం కి అవసరమైన ఆయుధసంపత్తి, వన్ రాంక్ వన్ పెన్షన్, చీఫ్ అఫ్ డిఫెన్సె స్టాఫ్ ని ఏర్పాటు చేయడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు ప్రధాని. బుద్ధుడిని, కుశోప్ బాకులాల గురించి కూడా ప్రస్తావించారు.
undefined
గాల్వాన్ లోయ దుర్ఘటనలో మరణించిన అందరూ సైనికులకు నివాళులు అర్పించారు ప్రధాని మోడీ. మరణించిన సైనికులు దేశం లోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారని, వారి అమరత్వం లడఖ్ పర్వతాల్లో ప్రతిధ్వనిస్తుందని మోడీ అన్నారు.
undefined
జాతీయ భద్రత విషయంలో తనకు ఇద్దరు మాతలు గుర్తుకు వస్తారని, ఒకరు భారత మాత అయితే... ఇంకొకరు సాహసవీర సైనికులను కన్న మాతలు అని మోడీ అన్నారు.
undefined
ఇక ప్రధాని మోడీ పర్యటనతో చైనా శాంతి జపించడం మొదలుపెట్టింది.రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, సమాచార మార్పిడి సాగుతున్న తరుణంలో ఈ సమయంలో ఎవరూ కూడ ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించడం సరైంది కాదని చైనా అభిప్రాయపడింది.
undefined
click me!