కర్ణాటక : కర్ణాటకలోకి బాగల్ కోట్ జిల్లాలో నటుడు, రాజకీయవాది ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదయ్యింది. చంద్రయాన్‌ను ఎగతాళి చేస్తూ.. ఓ వ్యంగ్య ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.
26
దీనిమీద ప్రకాష్‌రాజ్‌పై శ్రీరామ్‌సేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.ఎస్ఆర్ఎస్ నాయకుడు శివానంద్ గైక్వాడ్ బనహట్టి పోలీస్ స్టేషన్ (బాగల్‌కోట్ జిల్లా)లో ఫిర్యాదు చేశారు.
36
ప్రకాశ్ రాజ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలతో తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నారు.
46
రకరకాల కారణాలతో బీజేపీమీద విరుచుకుపడుతున్నారు. అయితే, చంద్రయాన్ మీద ఇలా స్పందించడంపై నెటిజన్లు కూడా ప్రకాష్ రాజ్ పై గుర్రుగా ఉన్నారు.
56
పార్టీలు, రాజకీయాలు వేరు.. దేశగౌరవం వేరని.. దేశ గౌరవాన్ని ఇనుమడించే ఇలాంటి వాటిని పొలిటిసైజ్ చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
66
ఇంతకీ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన ఫొటోలో ఏముందంటే.. చంద్రయాన్ 3 మిషన్ చందమామపై ల్యాండ్ అవ్వగానే ఓ ఫొటో పంపినట్టుగా చెబుతూ.. ఆ ఫొటోలో ఓ చాయ్ వాలా ఉన్నట్టుగా ఉంది. దీంతో ఆయన బీజేపీని టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.