Lora Missile : మన డిల్లీలో గాల్లోకి లేపి లాహోర్ ను లేపేయొచ్చు.. భారత ఆర్మీ అమ్ములపొదిలో మరో పవర్ అస్త్రం

Published : Jul 11, 2025, 04:11 PM ISTUpdated : Jul 11, 2025, 04:14 PM IST

భారత ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ అస్త్రం సిద్దమవుతోంది. ఇది గాల్లోకి లేచిందో డిల్లీ నుండే పాకిస్థాన్ లోని లాహోర్ ను లేపేయొచ్చు. అంత పవర్ ఫుల్ మిస్సైల్ ఏది? దీని రేంజ్ ఎంత? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
భారత వాయుసేనకు మరింత బూస్ట్...

Indian Air Force : భారత ఆర్మీ ఎంత బలంగా ఉందో ఇటీవల పాకిస్థాన్ తో యుద్దవాతావరణ సమయంలో యావత్ ప్రపంచానికి అర్థమయ్యింది. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ధ్వంసం చేసింది భారత్... ఇందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేక మిస్సైల్స్ వాడింది. ఇందులో ఇజ్రాయెల్ కు చెందిన రాంపేజ్ మిస్సైల్ కూడా ఉంది. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ నుండి మరో పవర్ ఫుల్ మిస్సైల్ భారత ఆయుధాగారంలో చేరుతోంది. అదే 'లోరా' మిస్సైల్.

25
లోరా మిస్సైల్ ప్రత్యేకతలివే

Lora (long Range Artillery) మిస్సైల్ ను ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీ (IAI) రూపొందించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి గాలి నుండి ఉపరితలానికి ప్రయోగించవచ్చు... ఇది 400 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యాన్ని కలిగివుంది. అందుకే ఈ మిస్సైల్ పై ఇప్పుడు భారత్ కన్ను పడింది... దీన్ని తమ ఆయుధ సంపత్తిలో చేర్చుకుని బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట వైమానిక దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో పాక్ వైమానిక స్థావనాలపై కూడా భారత్ దాడిచేసి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కు చెందిన రాంపేజ్ మిస్పైల్స్ ను పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ లోని సుక్కుర్ ఎయిర్ బేస్ పై ప్రయోగిచింది భారత్. 250 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల ఈ మిస్సైల్ ఈ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసింది.

ఈ రాంపేజ్ మిస్సైల్ చాలా ఖచ్చితత్వంలో పాక్ ఎయిర్ బేస్ పై దాడిచేసింది. ఈ క్రమంలో ఇలాంటి మరిన్ని ఇజ్రాయెల్ టెక్నాలజీ మిస్సైల్స్ ను సమకూర్చుకునేందుకు భారత్ సిద్దమయ్యింది. ఇలా అత్యాధునిక టెక్నాలజీతో మరింత దూర లక్ష్యాలను చేధించగల పవర్ ఫుల్ మిస్సైల్ 'లోరా' ను సిద్దం చేస్తోంది. ఇది పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లకుండానే అక్కడి లక్ష్యాలను చేధించగల మిస్సైల్.

35
లోరా మిస్సైల్ తో భారత వాయుసేన మరింత బలోపేతం

ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో భారత్ రూపొందించే లోరా మిస్సైల్ వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇది 400 కి.మీ దూరంలోని శత్రు స్థావరాలపై దాడి చేయడమే కాదు ఒకే యుద్ద విమానం నుండి ఎక్కువ ప్రయోగించవచ్చే వీలుంటుంది. అంటే సుఖోయ్ Su 30 MKI వంటి యుద్ద విమానాలు ఒకేసారి నాలుగు లోరా మిస్సైల్స్ ను తీసుకెళ్లగలవు. ఇది ఇటీవల కాలంలో పాకిస్థాన్ తో చోటుచేసుకున్నట్లు ఉద్రిక్తత సమయాల్లో మన వైమానిక దళ సత్తాను చాటుతుంది.

ఇది శత్రువుల అండర్ గ్రౌండ్ బంకర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ సెంటర్లను ధ్వంసంచేసేందుకు డిజైన్ చేశారు. దీని వేగం, అత్యాధునిక టెక్నాలజీ చాలా ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాలపై దాడిచేయగలదు... శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టం దీన్ని అంత ఈజీగా గుర్తించలేవు. అవి కనిపెట్టేలోపే ఈ లోరా మిస్సైల్ దాడిని పూర్తిచేస్తుంది.

దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భూమిలోకి చొచ్చుకెళ్లి బంకర్లను కూడా ధ్వంసం చేయగలదు. అలాగే పెద్ద ప్రాంతాలను ఒకేసారి ధ్వంసం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ లోరా మిస్సైల్ ను వివిధ వార్ హెడ్స్ నుండి ప్రయోగించవచ్చు. ఇది 'ఫైర్ ఆండ్ ఫర్గెట్' రకానికి చెందినది... అంటే దీన్ని ప్రయోగించడమే పైలట్ పని, తర్వాత అదే పని పూర్తిచేస్తుంది. అంటే దీన్ని ప్రయోగించిన యుద్దవిమానం, అందులోని పైలట్ సేప్ గా ఉండవచ్చన్నమాట. 

45
లోరా మిస్సైల్ తయారీకి భారత్ రెడీ

ఈ పవర్ ఫుల్ లోరా మిస్సైల్ ను తయారుచేసేందుకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. 2023 లోనే ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీస్ తో భారత్ కు చెందిన BEL (Bharat Electronics Limited)  ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా లోరా మిస్సైల్ భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఒప్పందం పాకిస్థాన్, చైనా వంటి శత్రుదేశాల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించి వుంటుంది.

55
లోరా మిస్సైల్ ఎందుకంత ప్రత్యేకం

అత్యాధునిక టెక్నాలజీ కలిగివుండే ఈ లోరా మిస్సైల్ బ్రహ్మోస్, రాంపేజ్ మాదిరిగా సుదూర లక్ష్యాలను చేధించగలదు. ఇది భారత వైమానిక దళంలో చేరితే మరింత బలం పెరుగుతుంది... 400 కి.మీ లక్ష్యాలను చేధించే ఈ మిస్సైల్ మనదగ్గరుంటే శత్రుదేశాలు భయపడతాయి. అలాగే యుద్ద విమానాలను నడిపే పైలట్లకు ప్రమాదం లేకుండా ఈ మిస్సైల్స్ ను ప్రయోగించవచ్చు.

కేవలం సుఖోయ్ నుండే కాదు రాఫెల్, తేజస్ వంటి యుద్దవిమానాల నుండి కూడా దీన్ని ప్రయోగించేందుకు భారత వాయుసేన ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది... వాయుసేనకు మరింత బూస్ట్ లభిస్తుంది. ఇలా లోరా మిస్సైల్ అందుబాటులోకి వస్తే పాకిస్థాన్ వంటి ఉగ్రవాద దేశాలకు మరింత గట్టిగా సమాధానం చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories