200 ఏళ్లుగా దీపావళి జరపని గ్రామం.. కారణం వింటే షాక్ అవుతారు !

Published : Oct 22, 2025, 06:57 PM IST

Lokikere Diwali Mystery: కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని లోకికేరె గ్రామంలో 200  సంవత్సరాలుగా దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. ఎందుకు ఈ గ్రామం దీపావళి జరుపుకోవడం లేదు? అసలు ఏం జరిగింది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
200 ఏళ్లుగా దీపావళి జరుపుకోని గ్రామం

దీపావళిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దేశం మొత్తం పండుగతో కళకళలాడుతుంటుంది. కొత్త బట్టలు ధరించి, పటాకులు పేల్చుతూ దీపావళి జరుపుకుంటారు. అయితే, కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని లోకికెరె గ్రామ ప్రజలు గత రెండు వందల సంవత్సరాలుగా దీపావళిని జరుపుకోవడం లేదు.

దేశం మొత్తం దీపాల పండుగతో టపాసుల శబ్దలు, దీపకాంతులతో ప్రకాశించే సమయంలో, లోకికేరె గ్రామం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. సుమారు ఆరునుంచి ఏడు తరాలుగా ఇక్కడి ప్రజలు దీపావళి పండగను జరుపుకోవడం మానేశారు. ఈ గ్రామంలో 70 శాతం కుటుంబాలు దీపావళిని సంతోష పండుగగా కాకుండా, స్మరణదినంగా భావిస్తారు.

25
లోకికేరె గ్రామం దీపావళిని ఎందుకు జరుపుకోవడం లేదు? విషాదకథ

సుమారు రెండు శతాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఒక దుర్ఘటన కారణంగా లోకికేరె గ్రామంలో దీపావళిని జరుపుకోవడం లేదు. గ్రామంలోని యువకులు దీపావళి కోసం కావలసిన పూలు, కాసే గడ్డి, బ్రహ్మదండి, ఇతర పూజా సామగ్రి కోసం అడవికి వెళ్లారు. కానీ వారు తిరిగి ఇంటికి రాలేదు. గ్రామస్థులు వారిని  ఎంత వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఆ ఘటన తర్వాత గ్రామంలోని పెద్దలు దీపావళి జరపడం అశుభంగా భావించారు. అప్పటి నుండి ఈ గ్రామంలో దీపావళిని జరుపుకోవడం మానేశారు. దీపావళి జరపడానికి ప్రయత్నించిన వారికి దురదృష్టం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఈ విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది.

35
గ్రామ ప్రజల విశ్వాసాలు

లోకికేరె గ్రామ ప్రజలు దీపావళిని శుభదినంగా కాకుండా సూతకదినంగా పరిగణిస్తారు. తమ పూర్వీకులు దీపావళి రోజున అడవికి వెళ్లి తిరిగి రాలేదు. దీపావళి జరుపుకుంటే వారు ఆగ్రహించి దుష్ఫలితాలు కలిగిస్తారని మా తాతలు చెప్పారనీ, అందుకే తాము ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.

45
మహాలయ అమావాస్యే వీరి దీపావళి

దీపావళి రోజున నిశ్శబ్దంగా ఉండే ఈ గ్రామ ప్రజలు, మహాలయ అమావాస్య రోజున తమ పూర్వీకులను స్మరించుకుంటారు. అప్పుడు గ్రామ పెద్దల స్మరణార్థం పూజలు, తర్పణాలు, కుటుంబ సమావేశాలు జరుగుతాయి.

వీరు దీపావళిని జరపకపోయినా, ఇతర గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న దీపావళి సంబరాలను చూసి ఆనందిస్తారు. కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి ఆ వేడుకల్లో పాల్గొంటారు కానీ తమ గ్రామంలో మాత్రం ఈ వేడుకలు జరుపుకోరు.

55
విషాదకథను సాంప్రదాయంగా మార్చుకున్న గ్రామం లోకికేరె

లోకికేరె కథ భారతీయ సంప్రదాయాల లోతైన భావనను తెలియజేస్తుంది. సంతోషం మాత్రమే కాకుండా తమవారిని గుర్తుచేసుకోవడం కూడా ఒక వేడుక కావచ్చు. రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఆ విషాదం ఈ గ్రామ ప్రజల జీవనశైలిలో భాగమైపోయింది.

ఇప్పటికీ ఈ గ్రామంలో ఏ శుభకార్యాలు లేదా ఉత్సవాలు దీపావళి రోజున చేయరు. ఆ రోజును అశుభ దినంగా భావిస్తారు. కానీ, దీనివెనకున్న విషాదకథలో వారి పూర్వీకుల పట్ల గౌరవం, స్మృతి, సాంస్కృతిక పరంపర పట్ల భక్తి కనిపిస్తున్నాయి. పండగ వేళ జరిగిన ఒక విషాదకథను సాంప్రదాయంగా మార్చుకుంది ఈ గ్రామం.

Read more Photos on
click me!

Recommended Stories