తెలుగు యువ నేతకు ముందువరుసలో సీటు
స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఎంపీల సీట్లను ఖరారు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాకు ట్రెజరీ బెంచ్‌లో మొదటి మూడు సీట్లు కేటాయించినట్లు తెలిపింది. రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు 58, 59 సీట్లు కేటాయించారు. ఇవి కూడా ముందు వరుసలోనే ఉన్నాయి.
ఎన్డీయే కోటా నుంచి భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్.డి. కుమారస్వామి, జనతాదళ్ (యునైటెడ్) మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ (లల్లన్) సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత రామ్మోహన్ నాయుడు, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీలకు ముందు వరుసలో సీట్లు దక్కాయి.