దేశంలో అప్పుడప్పుడు ఐటీ దాడులు జరుగుతూనే ఉంటాయి. అయితే.. రీసెంట్ గా జరిగిన ఓ ఐటీ దాడి మాత్రం హెడ్ లైన్స్ లో నిలిచింది. దాదాపు పది రోజుల పాటు అధికారులు డబ్బు లెక్కపెట్టడం గమనార్హం. మొదట అధికారులు మాన్యువల్ గా ఈ డబ్బు లెక్కింపు మొదలుపెట్టారు.
ఇది సాధ్యమయ్యే పని కాదని.. ఒక మెషిన్లు తెప్పించారు. మొదట రెండు, మూడు మెషిన్లు తెప్పించి డబ్బులు లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఆ మెషిన్లు కూడా సరిపోవని అర్థమై ఏకంగా 36 మెషిన్లు తెప్పించి మరీ ఈ డబ్బు లెక్కపెట్టారు. అది కూాడా దాదాపు 10 రోజులపాటు ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ సోదాల్లో రూ.352కోట్లు స్వాధీనం చేసుకున్నారు.