Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?

Published : Jan 18, 2026, 09:54 AM IST

Liquor sales: ఆల్క‌హాల్ ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తెలిసినా చాలా మంది ఆ అల‌వాటును మార్చుకోరు. ఇక వైన్స్ షాప్స్ దాదాపు ప్ర‌తీ రోజూ ప‌ని చేస్తాయి. కానీ ఏడాదిలో కొన్ని రోజులు మాత్రం దుకాణాలు బంద్ అవుతాయి. 2026లో వైన్స్ బంద్ ఉండే రోజులివే. 

PREV
14
2026లో మందుబాబులకు షాక్

కొత్త ఏడాదిలో పార్టీలు, సెలబ్రేషన్లు ప్లాన్ చేసుకునే వారికి ఊహించని ఆటంకం ఎదురుకానుంది. 2026లో దేశవ్యాప్తంగా ఆల్కహాల్ విక్రయాలపై ఆంక్షలు ఉండే రోజులను ప్రభుత్వాలు ఖరారు చేశాయి. మెట్రో నగరాలు సహా ప్రధాన పట్టణాల్లో మొత్తం 28 రోజుల పాటు వైన్ షాపులు, బార్‌లు మూసివేయనున్నారు.

24
డ్రై డే అంటే ఏంటి? ఎందుకు అమలు చేస్తారు?

డ్రై డే రోజున ఆల్కహాల్ విక్రయం పూర్తిగా నిషేధం. రిటైల్ వైన్ షాపులు, బార్‌లు, పబ్‌లు, హోటళ్లలో ఆల్కహాల్ అమ్మకాలు ఉండవు. జాతీయ సెలవులు, ముఖ్యమైన పండుగలు, శాంతిభద్రతల దృష్ట్యా ఎక్సైజ్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేస్తుంది. పండుగల పవిత్రత కాపాడటం కూడా లక్ష్యం.

34
2026లో డ్రై డేస్ పూర్తి జాబితా

2026లో దేశవ్యాప్తంగా వర్తించే ప్రధాన డ్రై డేస్ ఇవి:

జనవరి 26 – గణతంత్ర దినోత్సవం

ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి

ఫిబ్రవరి 19 – ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్ర)

ఫిబ్రవరి 23 – స్వామి దయానంద్ జయంతి

మార్చి 4 – హోలీ

మార్చి 20 – ఈద్ ఉల్ ఫితర్

మార్చి 23 – షహీద్ దివాస్ (మహారాష్ట్ర)

మార్చి 26 – శ్రీరామ నవమి

ఏప్రిల్ 3 – గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 10 – మహావీర్ జయంతి

ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి

మే 1 – కార్మిక దినోత్సవం

మే 27 – బక్రీద్

జూన్ 26 – ముహర్రం

జూలై 25 – ఆషాఢ ఏకాదశి

జూలై 29 – గురు పూర్ణిమ

ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 25 – ఈద్-ఎ-మిలాద్

సెప్టెంబర్ 4 – జన్మాష్టమి

సెప్టెంబర్ 14 – గణేష్ చతుర్థి (మహారాష్ట్ర, కర్ణాటక)

సెప్టెంబర్ 25 – అనంత చతుర్దశి (మహారాష్ట్ర)

అక్టోబర్ 2 – గాంధీ జయంతి

అక్టోబర్ 7 – మహర్షి వాల్మీకి జయంతి

అక్టోబర్ 20 – దసరా (కొన్ని నగరాల్లో)

నవంబర్ 5 – కార్తీక ఏకాదశి

నవంబర్ 8 – దీపావళి (ఢిల్లీ–NCR)

నవంబర్ 24 – గురునానక్ జయంతి (కొన్ని చోట్ల)

44
రాష్ట్రాల వారీగా మారే ఆంక్షలు

డ్రై డేస్ జాబితాలో జాతీయ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంటాయి. కొన్ని మతపరమైన సెలవులు మాత్రం ప్రాంతాల ఆధారంగా మారుతాయి. వీటిలో ప్ర‌ధాన‌మైవ‌ని.

మహారాష్ట్ర: శివాజీ జయంతి, షహీద్ దివాస్, అనంత చతుర్దశి రోజుల్లో ఆంక్షలు.

కర్ణాటక: గణేష్ చతుర్థి రోజున బెంగళూరు వంటి నగరాల్లో నిషేధం.

ఢిల్లీ: దీపావళి రోజున ఢిల్లీ–NCR పరిధిలో డ్రై డే.

గ‌మ‌నిక‌: ఆల్క‌హాల్ ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని గుర్తించాలి. కొంత మొత్తంలో తీసుకున్నా ఆల్క‌హాల్ శ‌రీరంపై చెడు ప్ర‌భావం చూపుతుంద‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

Read more Photos on
click me!

Recommended Stories