Bhu Aadhar
Union Budget 2024-25 : కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కొన్నాళ్లుగా బడ్జెట్ 2024-25 పై ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేసారు... ఇవాళ ఇది ప్రజలముందుకు వచ్చింది. మోదీ 3.O సర్కార్ ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ పై సర్వత్వా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పుతూ ప్రవేశపెట్టిన ఏడో బడ్జెట్ లో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటే ఈ భూ ఆధార్.
Bhu Aadhar
ఇప్పటివరకు భారతీయ పౌరులకు అందించే ఆధార్ కార్డుల గురించి అందరికీ తెలుసు. కానీ భూములకు కూడా ఆధార్ కార్డ్ వుంటుందనే విషయం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం విన్నతర్వాతే చాలామందికి తెలిసింది. ఈ క్రమంలోనే అసలు ఏమిటీ భూ ఆధార్? ఎలా కేటాయిస్తారు..? మన భూములకు ఆధార్ పొందాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమయ్యాయి. కాబట్టి భూ ఆధార్ గురించి తెలుసుకుందాం.
Bhu Aadhar
ఏమిటీ భూ-ఆధార్ :
భారతీయులందరి వద్ద వుండే గుర్తింపుకార్డు ఆధార్. మన పేరు, ఊరుతో పాటు చాలా వివరాలు ఈ ఆధార్ కార్డులో వుంటాయి. సేమ్ ఇలాగే భూముల వివరాలతో కూడినదే భూ ఆధార్. భూములకు సంబందించిన సంస్కరణల్లో భాగంగా భూ ఆధార్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
Bhu Aadhar
యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ULPIN) నే భూ ఆధార్ అంటారు. ఇది భూ రికార్డుల డిజిటలైజ్ ప్రక్రియ. భూమికి ప్రత్యేకంగా 14 అంకెల డిజిటల్ గుర్తింపును కేటాయించి ఆ భూమికి సంబంధించిన రికార్డులన్ని దానికి లింక్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఒక్క నంబర్ వుంటే చాలు భూమికి సంబంధించిన వివరాలన్ని లభిస్తాయి.
Bhu Aadhar
డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగామ్ లో భాగంగా భూ ఆధార్ చేపడుతున్నారు. 2008 లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ భూ ఆధార్ అమలవుతోంది.