First Union Budget of India: భారతదేశ మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

First Published | Jul 22, 2024, 11:16 AM IST

భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది.భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది.

భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది.భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది.

మొదటి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

ఈ తొలి బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా ఆహార, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించడం, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాలు ప్రాముఖ్యత పొందాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగం, సమాజంలో శాంతి భద్రతలు కూడా ముఖ్యంగా ప్రస్తావించారు.


ఆహారపరమైన సవాళ్లు...

బ్రిటీష్ కాలంలో నాలుగేళ్లపాటు రూ.127 కోట్ల విలువైన 43.80 లక్షల టన్నుల ఆహార పదార్థాలను దిగుమతి చేసుకున్న భారత్, స్వతంత్య్రం పొందిన సంవత్సరం కూడా రూ.42 కోట్ల విలువైన 10.62 లక్షల టన్నుల ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని సాధించాలనే కృషి ప్రారంభమైంది.

ఆదాయ, వ్యయాలు

1947-48 ఆర్థిక సంవత్సరంలో రూ.171.15 కోట్ల ఆదాయ అంచనాలు, రూ.197.39 కోట్ల వ్యయ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రక్షణ రంగానికి రూ.92.74 కోట్లు, పౌర ఖర్చులకు మిగతా భాగం కేటాయించబడింది. విభజన కారణంగా రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.

విదేశీ మారక నిల్వలు, దిగుమతులు

స్టెర్లింగ్ పద్దు కింద 1946 ఏప్రిల్ 5 నాటికి అత్యధికంగా రూ.1733 కోట్లు ఉండగా, 1947 జూలై నాటికి అవి రూ.1547 కోట్లకు తగ్గాయి. ఆహార దిగుమతుల కారణంగా ఈ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఎంపైర్ డాలర్ పూల్ కింద మనం రూ.405 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు సంపాదించి, రూ.240 కోట్లను ఖర్చు చేశాం.

దేశ ఆర్థిక పరిస్థితి

1947-48 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎనిమిదవ లోటు బడ్జెట్‌ను చూచింది. దేశ విభజన కారణంగా ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో సాధారణ స్థితికి చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. రుణ స్థితి కూడా మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు.

భవిష్యత్ సంకల్పం

స్వతంత్ర భారత్ ఆసియాలో లీడర్ కావాలన్న లక్ష్యంతో క్రమశిక్షణతో కూడిన చర్యలు చేపట్టాలని షణ్ముఖం చెట్టి పిలుపునిచ్చారు. శాంతి భద్రతలను కాపాడి, ఉత్పత్తిని పెంచి, అంతర్గత సంఘర్షణలను నివారించేందుకు దేశ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Latest Videos

click me!