క్యాబ్ డ్రైవర్ ని కొట్టిన మహిళ కేసులో.. షాకింగ్ విషయాలు..

First Published Aug 4, 2021, 10:09 AM IST

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, జనం దీన్ని అడ్డుకోలేదు. పైగా లక్నో పోలీసులు క్యాబ్ డ్రైవర్‌పై కేసు బుక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో తర్వాత సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

న్యూ ఢిల్లీ : జులై 31 నాడు ఢిల్లీలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ ని విచక్షణా రహితంగా కొడుతుంది. ఈ ఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా డ్రైవర్ ని కొట్టిన అమ్మాయి మీద కూడా కేసు నమోదయ్యింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, జనం దీన్ని అడ్డుకోలేదు. పైగా లక్నో పోలీసులు క్యాబ్ డ్రైవర్‌పై కేసు బుక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో తర్వాత సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వీడియోలో మహిళ క్యాబ్ డ్రైవర్‌ని కనీసం 20 సార్లు ఎగెరెగిరి మరీ చెంపదెబ్బ కొట్టింది ఆ అమ్మాయి. అతను వాహనాన్ని అతివేగంతో నడుపుతున్నాడని, తనకు తృటిలో ప్రమాదం తప్పిపోయిందని చెబుతోంది.
undefined
ఉత్తర ప్రదేశ్లోని బిజీగా ఉన్న అవధ్ రోడ్ లో క్యాబ్ డ్రైవర్ ని నిర్దాక్షిణ్యంగా కొట్టిన మహిళ కేసులో అసలు వాస్తవాలు ఇవి. ఆ అమ్మాయిని ప్రియదర్శినిగా గుర్తించారు. ఆమె కృష్ణా నగర్‌లోని కేసరి ఖేడా నివాసి. దోపిడీకి పాల్పడటం లేదా ప్రయత్నించడం, నష్టం, నష్టం కలిగించడం వంటి ఆరోపణల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తన ఫిర్యాదులో, డ్రైవర్ షహాదత్‌ తన తప్పు ఏదీ లేకుండానే తనను దేశం ముందు దోషిగా నిలబెట్టిందని, నా ఫోన్‌ను పగలగొట్టి, కాలర్ పట్టుకుందని ఆరోపించాడు. అంతేకాదు తన కారు డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న రూ. 600లను కూడా ఆమె లాక్కుందని ఆరోపించాడు.
undefined
వీడియోలో, తెల్లటి టీ షర్టు, జీన్స్, స్పోర్ట్స్ షూ, కళ్లజోడు పెట్టుకున్న మహిళ అవధ్ క్రాసింగ్ వద్ద జీబ్రా క్రాసింగ్ మీదినుంచి రోడ్డు దాటుతూ క్యాబ్ ముందు ఆగింది. ఆ వెంటనే క్యాబ్ తలుపు తెరిచి డ్రైవర్ ని బయటకు లాగింది. అతడిని కాలర్ పట్టుకుని లాగి, చెంపపగల కొట్టడం ప్రారంభించింది. ఈ వీడియోలో ఆ డ్రైవర్ ఘటనా స్థలానికి మహిళా పోలీసులను పిలవమని ప్రేక్షకులను అభ్యర్థించడం చూడొచ్చు. ఆ మహిళ అతనిపై పదేపదే దాడి చేస్తూనే ఉంది. ఒక సమయంలో డ్రైవర్ ఫోన్ లాక్కుని నేలమీద విసిరికొట్టింది. ఒకతను దీన్ని ఆపడానికిమధ్యలో వెడితే అతడిని కూడా కొట్టింది. వీడియో మధ్యలో ట్రాఫిక్ పోలీసు జోక్యం చేసుకొని మహిళను క్యాబ్ డ్రైవర్ నుంచి వేరు చేసి రోడ్డు పక్కకు తీసుకెళ్తున్నట్లు ఉంది. కానీ, కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ మళ్ళీ ఆ వ్యక్తిని కార్నర్ చేస్తూ కొట్టడం ప్రారంభించింది.
undefined
ఆ క్యాబ్ డ్రైవర్ ను సాదత్ అలీ సిద్ధిఖీగా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు అతనిని, మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీనిమీద క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ "పోలీసులు నా ఫిర్యాదును కూడా తీసుకోలేదు. నన్ను 24 గంటల పాటు లాకప్ లో ఉంచారు" అన్నాడు క్యాబ్ డ్రైవర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ సోదరుడికి ఈ విషయం తెలియగానే, అతను కొంతమంది స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని, అతని సోదరుడిని వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేయగలిగాడని తెలిపారు. అంతేకాదు "పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. డ్రైవర్‌కి కూడా చలానా చేశారు" అని లాయర్ చెప్పారు.
undefined
దీనిమీద బాధితుడు మాట్లాడుతూ.. ‘నన్ను దేశం ముందు అవమానించింది. నా పరువు ఎలా తెచ్చిస్తారో చెప్పండి’ అని అడిగాడు. తప్పులేని వారిమీద కేసు నమోదు చేయడంపై పోలీసులు మీద దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. ట్విటర్ లో ఈ వీడియో మీద విపరీతమైన నిరసన వ్యక్తమవుతోంది. ఒకతను కామెంట్ చేస్తూ.. "అంత ట్రాఫిక్ లో వెహికిల్స్ వస్తుంటే ఆమె రోడ్డును ఎలా దాటగలదు? అది ఆమె తప్పు కాదా? పోలీసులు దీనిని ఎలా అనుమతించారు? దయచేసి క్యాబ్ డ్రైవర్ కి మద్దతు ఇవ్వండి విద్యార్థులు కూడా #అరెస్ట్‌లక్నో గర్ల్ " అంటూ ట్వీట్ చేశారు.
undefined
మరొక మైక్రోబ్లాగర్ "ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తోంది. అందుకే అంత ట్రాఫిక్ లోకి వచ్చింది. క్యాబ్ డ్రైవర్ కంట్రోల్ చేయకపోతే ఆమె పని అయిపోయేది. ఆమెకు గట్టి గుణపాఠం చెప్పాలి." అని చెప్పుకొచ్చాడు. మరికొంతమంది జెండర్ పేరుతో అమ్మాయి మీద సాఫ్ట్ కార్నర్ చూపించొద్దని అన్నారు. "జెండర్ కారణంగా ఎలాంటి సున్నితత్వం చూపబడదని అనుకుంటున్నాం. ఇది అవాంఛనీయం, ప్రోత్సహించకూడని చర్య. సంయమనం ప్రదర్శించినందుకు ఆ వ్యక్తికి ప్రశంసలు. అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఊహించగలం’ అని ట్వీట్ చేశాడు.
undefined
click me!