‘రెజ్లర్ సుశీల్ కుమార్ ను చంపేస్తా’.. బెదిరించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అనురాధ అరెస్ట్..

First Published Aug 2, 2021, 11:19 AM IST

రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సుశీల్ కుమార్ జతేదీ మేనల్లుడు సోను మహల్ ను కూడా చితకబాదాడు.  విషయం తెలిసిన జతేదీ సుశీల్ కుమార్ ను చంపేస్తానంటూ హెచ్చరించాడు. జతేదీపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు.

ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ ను చంపేస్తానంటూ బెదిరించిన ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ కాలా జతేది, అతడి భాగస్వామి ’రాజస్థాన్ డాన్’ అనురాధ చౌదరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. షహరాన్‌పూర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ వెల్లడించింది. గ్యాంగ స్టర్ కాలా తలపై ఏడు లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోనీ పట్ కు చెందిన జతేదిపై ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లలో పలు కేసులు నమోదై ఉన్నాయి.
undefined
రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సుశీల్ కుమార్ జతేదీ మేనల్లుడు సోను మహల్ ను కూడా చితకబాదాడు. విషయం తెలిసిన జతేదీ సుశీల్ కుమార్ ను చంపేస్తానంటూ హెచ్చరించాడు. జతేదీపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు. గత పది నెలల్లో కాలా జతేది గ్యాంగ్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లలో 25 హత్యలకు పాల్పడింది. కాలా జతేదీ భాగస్వామి వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాలా రాణా థాయిలాండ్ లో ఉన్నాడని, మరో పార్ట్నర్ గోల్డీ బ్రార్ కెనడాలో ఓ గ్యాంగ్ నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 2020లో కాలా జతేదీ ఫరీదాబాద్లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.
undefined
కాగా, యువ రెజ్లర్ సాగర్ హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపిక్ మెడల్ విన్నర్ సుశీల్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు మే 23న పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 20 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌ని, అతని అసిస్టెంట్ అజయ్ కుమార్‌ను ముడ్గల్ ఏరియాలో అదుపులోకీ తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు... ఒలింపిక్స్‌లో భారత్‌కి రెండు మెడల్స్ అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై డిసెంబర్ 4న హత్యకేసు నమోదైంది. ఢిల్లీలో ఛత్రపాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ సాగర్ రాణా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
undefined
పోలీస్ కానిస్టేబుల్ కొడుకైన 23 ఏళ్ల సాగర్ రాణాపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్టు తేల్చారు పోలీసులు. ఈ హత్య జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు హత్యకు ఉసిగొల్పాడని ఆరోపణలు ఉన్నాయి. సుశీల్ కుమార్‌పై హత్యానేరం కేసు నమోదుచేసిన పోలీసులు, అతని కోసం దాదాపు 19 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సుశీల్ కుమార్ ఎక్కడ ఉన్నది సమాచారం తెలియకపోవడంతో ఈ నెల 18న నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి, సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని తెలిపారు.
undefined
సుశీల్ కుమార్‌తో పాటు హత్యకేసులో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న అతని అసోసియేట్ అజయ్ కుమార్‌ జాడ తెలియచేసినవారికి బహుమతిగా రూ.50 వేల రివార్డు ఇస్తామని తెలిపారు. దీంతో జనాల నుంచి పోలీసులకు సమాచారం అందించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో సుశీల్ కుమార్ కారులో వెళ్తున్నామని సమాచారం అందుకున్న పోలీసులు, అతన్ని ముడ్గల్ ఏరియాలో అరెస్ట్ చేశారు.
undefined
2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్, 2012లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ‘రాజీవ్ ఖేల్‌రత్న’తో పాటు ‘అర్జున’ అవార్డు కూడా సొంతం చేసుకున్న సుశీల్ కుమార్‌పై హత్యకేసు నమోదుకావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెజ్లింగ్‌తో సత్తా చాటిన సుశీల్ కుమార్‌కి భారత రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఛత్రపాల్ స్టేడియంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి సాగర్ మరణానికి కారణమైంది.
undefined
click me!