బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (61) మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్పకు అత్యంత సన్నిహితుడు. మాజీ రాష్ట్ర హోంమంత్రి దగ్గరి సహాయకుడిగా పనిచేశారు.
బొమ్మై రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. బసవరాజు బొమ్మై మాజీసీఎం ఎస్ఆర్ బొమ్మే కుమారుడు. బొమ్మై 1960లో హబ్లీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు.
బసవరాజ్ బొమ్మై గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. వ్యాపారవేత్తగా మారడానికి ముందు బొమ్మై పూణేలోని టాటా మోటార్స్ లో మూడు సంవత్సరాలు పనిచేశారు.
బొమ్మై మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాగే పవర్ ఫుల్ లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారు. మొదటి సారిగా బొమ్మై 1998 లో కర్ణాటక శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తరువాత జనతాదళ్ నుండి నిష్క్రమించి 2008లో బిజెపిలో చేరారు.
మరో ముఖ్యమంత్రి జెహెచ్ పాటిల్ దగ్గర కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పొలిటికల్ సెక్రటరీగా పనిచేశారు.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై న్యాయశక, పార్లమెంటరీ వ్యవహారాలు- చట్టం, జల వనరుల శాఖల మంత్రిగా కూడా పనిచేశారు.
గోల్ఫ్ అన్నా, క్రికెట్ అన్నా కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి చాలా ఇష్టమైన వ్యాపకాలు.