చేపల కోసం వల వేస్తే కోట్ల రూపాయలు చిక్కాయి.. తిమింగల వాంతి ఎందుకు ఖరీదైనది?

Published : Nov 12, 2025, 06:19 PM IST

Whale Vomit: కేరళలోని కోయిలాండిలో మత్స్యకారుల వలలో కోట్ల విలువైన తిమింగలం వాంతి (ఆంబర్‌గ్రిస్) చిక్కింది. వారు దానిని కోస్టల్ పోలీసులకు అప్పగించారు. ఎందుకు తిమింగలం వాంతి కోట్ల రూపాయల విలువైనది?

PREV
15
కోయిలాండీ తీరంలో కోట్ల రూపాయల తిమింగలం వాంతి

కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలాండీ సముద్రతీరంలో మత్స్యకారుల వలలో కోట్ల రూపాయల విలువైన తిమింగల వాంతి (Ambergris) చిక్కింది. ఇది అత్యంత అరుదుగా లభించే సముద్ర వనరుగా పరిగణిస్తారు. గురుకులం బీచ్ సమీపంలో మత్స్యకారులు చేపల కోసం వలలు వేస్తే ఆంబర్‌గ్రిస్ పడింది.

మత్స్యకారులు సురేష్, బైజు అనే ఇద్దరి యజమాన్యంలోని “గెలాక్సీ” అనే బోటులో చేపల వేటకు వెళ్లగా ఈ విలువైన పదార్థం వలలో చిక్కింది. వారు వెంటనే ఇది విలువైనదని గుర్తించి కోయిలాండీ కోస్టల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

25
తిమింగల వాంతి (ఆంబర్‌గ్రిస్) అంటే ఏమిటి?

తిమింగల వాంతి లేదా ఆంబర్‌గ్రిస్ అనేది స్పెర్మ్ వేల్ అనే తిమింగల జాతి జీర్ణ వ్యవస్థలో ఏర్పడే మెత్తటి, మైనంలాంటి పదార్థం. తిమింగలం తినలేని పదార్థాలను (ఉదా: స్క్విడ్ బెక్కులు) బయటకు పంపే సమయంలో ఈ వాంతి ఏర్పడుతుంది.

సముద్ర జలంలో తేలుతూ చాలా కాలం ఉండటం వల్ల ఇది కఠినమై రాతి ఆకారాన్ని పొందుతుంది. ఇది అత్యంత అరుదైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా పర్ఫ్యూమ్ పరిశ్రమలో దీనికి భారీ డిమాండ్ ఉంది. ఒక కిలో ఆంబర్‌గ్రిస్ ధర ₹1 కోటి రూపాయల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

35
మత్స్యకారుల వలలో ఆంబర్‌గ్రిస్.. ఆ తర్వాత ఏం చేశారు?

వలలో చిక్కిన ఈ ఆంబర్‌గ్రిస్ గురించి తెలిసిన వెంటనే మత్స్యకారులు చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వారు దానిని విక్రయించేందుకు ప్రయత్నించకుండా, కోయిలాండీ హార్బర్‌కు చేరుకున్న వెంటనే కోస్టల్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దాన్ని పేరాంబ్ర ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అధికారికంగా అందజేశారు. స్థానిక మత్స్యకార సంఘాలు ఈ సంఘటనను సామాజిక బాధ్యతకు చిహ్నంగా అభినందించాయి.

45
ఆంబర్‌గ్రిస్ అమ్మకం పై నిషేధం

భారతదేశంలో తిమింగల వాంతి (ఆంబర్‌గ్రిస్) విక్రయం లేదా కొనుగోలు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం నిషేధితమైనది. ఎందుకంటే ఈ పదార్థం లభించే స్పెర్మ్ వేల్ జాతి రక్షిత జాతిగా గుర్తించారు. ఇలాంటి వస్తువులను దాచుకోవడం, విక్రయించడం కఠినమైన శిక్షార్హ నేరంగా చట్టం పేర్కొంటోంది. ఇటీవలి కాలంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తిమింగల వాంతి స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కోయిలాండీ మత్స్యకారుల చర్య ఆదర్శంగా నిలిచింది.

55
అంతర్జాతీయ స్థాయిలో ఆంబర్‌గ్రిస్ కు మస్తు డిమాండ్

తిమింగల వాంతిని ప్రపంచవ్యాప్తంగా “Floating Gold” (తేలే బంగారం) అని పిలుస్తారు. దీని నుండి వచ్చే సువాసన పదార్థాలు పర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకే, మాల్దీవ్స్ వంటి దేశాల్లో ఆంబర్‌గ్రిస్ విక్రయం చట్టబద్ధం కాగా, భారతదేశంలో మాత్రం కఠిన నిషేధం ఉంది. సముద్ర జీవజాతుల సంరక్షణకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ చట్టాలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories