జూన్‌లో కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే ఛాన్స్: నిపుణుల వార్నింగ్

First Published | May 25, 2020, 2:56 PM IST

గతంలో కంటే జూన్ మాసంలో కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ ఏడాది జూన్ మాసంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రం కానుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు రానున్న రోజుల్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకొంటాయో ఆ నిర్ణయాలు ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో చూడాలి.
undefined
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య కూడ పెరుగుతూనే ఉంది. అంతేకాదు దేశంలో కూడ కరోనా కేసుల సంఖ్య కూడ పెరుగుతూనే ఉన్నాయి.రెండు రోజులుగా ఆరు వేల కు పైగా కరోసా కేసులు నమోదౌతున్నాయి.
undefined

Latest Videos


ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ సమయంలో కొంత శాతం కరోనా కేసులు తగ్గాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన సమయంలో కేసులు పెరుగుతున్నాయి. రష్యా, చైనా, అమెరికా లాంటి దేశాల్లో మళ్లీ కరోనా కేసులు కూడ పెరుగుతున్నాయి.
undefined
మన దేశంలోని కేరళ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒకే రోజున 42 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర,తమిళనాడు, ఏపీ, విదేశాల నుండి వచ్చిన వారితో ఈ కేసులు నమోదైనట్టుగా కేరళ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
undefined
దేశంలో కరోనా పరీక్షలు పెంచడం కూడ కరోనా కేసులు పెరగడం కూడ కారణమనే అభిప్రాయాన్ని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో కూడ పరీక్షలు నిర్వహించాలని కూడ నిపుణులు సూచిస్తున్నారు.
undefined
దేశంలో ఆర్ధిక పరమైన అవసరాల కోసం లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఏప్రిల్, మే మాసాల్లో కంటే జూన్ లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని తన్మయ్ మహాపాత్ర చెప్పారు.
undefined
జూలైలో కరోనా వైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
click me!