నా పేరు ముందు భర్త పేరు ఎందుకు? రాజ్యసభలో రెచ్చిపోయిన జయా బచ్చన్

Published : Jul 30, 2024, 02:33 PM IST

రాజ్యసభలో జయా బచ్చన్ ఆవేశానికి లోనయ్యారు. భ‌ర్త పేరుతోనే మ‌హిళ‌కు గుర్తింపు వ‌స్తుందా..? అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ను ప్రశ్నించారు.

PREV
14
నా పేరు ముందు భర్త పేరు ఎందుకు? రాజ్యసభలో రెచ్చిపోయిన జయా బచ్చన్
Jaya bachchan and Rekha

బాలీవుడ్‌లో లెజెండరీ స్టార్ జంట అమితాబ్- జయా బచ్చన్‌లు. అనేక కష్ట సమయాల్లో జయా బచ్చన్ తన భర్తకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా బాలీవుడ్ లెజెండరీ నటి రేఖతో అమితాబ్ బచ్చన్ రిలేషన్ షిప్ విషయంలో మీడియాలో వచ్చిన పుకార్లను జయ సింపుల్‌గా కొట్టిపారేశారు. ఇదొక్కటే కాదు.. అన్ని విషయాల్లోనూ జయా బచ్చన్‌ అమితాబ్‌కి అండగా నిలుస్తుంటారు. 

24
Jaya bachchan

తాజాగా రాజ్యసభలో పరిచయం సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ పేరుతో పాటు భర్త పేరు అమితాబ్‌ను జోడించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎగువ సభ ప్రొసీడింగ్స్‌లో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘మిసెస్ జయ అమితాబ్ బచ్చన్....’ అని సంబోధించారు. దీనిపై స్పందించిన జయా బచ్చన్.. ఆవేశానికి లోనయ్యారు. కేవ‌లం జ‌యా బ‌చ్చ‌న్ అని పిలిస్తే స‌రిపోతుంద‌న్నారు.    భ‌ర్త పేరుతోనే మ‌హిళ‌కు గుర్తింపు వ‌స్తుందా..? మ‌హిళ‌ల‌కు సొంతంగా ఉనికి లేదా వారు సొంతంగా ఏమీ సాధించ‌లేరా..? అని ప్ర‌శ్నించారు. ‘మహిళలకు కూడా సొంత హోదా ఉంటుంది. వారు వారి సొంత విజయాన్ని కలిగి ఉంటారు. భర్త పేరు జోడించాల్సిన అవసరం లేదు. అందుకే జయా బచ్చన్ చాలు’ అన్నారు.

34
Jaya amitabh bachchan

కాగా, నటి నుంచి రాజకీయ నాయకురాలుగా మారిన జయా బచ్చన్ తన క్రోధ స్వభావం కారణంగా తరచూ వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు రాజ్యసభలో ప్రవర్తనపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తనకు సొంత గుర్తింపు ఉందని భావించే ఆమె.. అమితాబ్ బచ్చన్ పేరును ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభలో స్పీకర్ పట్ల ఈ తరహా ప్రవర్తన సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. 

44
Jaya Bachchan in Rajyasabha

అయితే, జయా బచ్చన్ వ్యాఖ్యలకు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ వెంటనే స్పందించారు. రికార్డుల్లో జయా అమితాబ్ బచ్చన్ అని రాసి ఉన్నందు వల్లే తాను అలా పిలిచినట్లు స్పష్టం చేశారు.

click me!

Recommended Stories