ఇక అమ్మాయిలకు నెలసరి సెలవులు... ఎన్నిరోజులో తెలుసా..?

First Published | Jul 29, 2024, 10:02 PM IST

అమ్మాయిలకు నెలసరి బాధనుండి కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అమ్మాయిలకు ప్రతి నెలలో ఓరోజు నెలసరి సెలవును ప్రకటించారు. ఇది ఎక్కడో తెలుసా..?

periods

ప్రతి మహిళ ఎదుర్కొనే కామన్ సమస్య పీరియడ్స్. ఇంట్లో వుండే మహిళలు సంగతి ఓకే... కానీ స్కూళ్లు, కాలేజీలకు వేళ్ళే అమ్మాయిలు...ఉద్యోగాల చేసే మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో చాలా ఇబ్బంది పడతారు. భరించలేని కడుపునొప్పితో పాటు బ్లడ్ బ్లీడింగ్ తో నరకయాతన అనుభవిస్తారు. కొందరు మహిళలకు హార్మోన్మ అసమతుల్యత కారణంగా  హెవీ బ్లీడింగ్ జరుగుతుంది... పీరియడ్స్ సమస్య కూడా ఎక్కువరోజులు వుంటుంది. 

periods

ప్రతి ఆడపిల్ల జీవితంలో పీరియడ్స్ సమస్య వుంటుంది... ఆ సమయంలో తీవ్ర ఇబ్బంది వుంటుంది. కానీ ఈ విషయం బయట చెప్పకోడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు.ఏవో కారణాలు చెప్పి స్కూల్, కాలేజీలకు డుమ్మా కొడుతుంటారు. అయితే అమ్మాయిల బాధను గుర్తించిన ఓ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు ప్రతినెలా ఓ రోజు పీరియడ్స్ సెలవును ప్రకటించింది. 
 


periods

చత్తీస్ ఘడ్ లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ అమ్మాయిల కోసం సరికొత్త సెలవు విధానాన్ని అమలు చేస్తోంది. అమ్మాయిల నెలసరి సమస్యకు దృష్టిలో వుంచుకుని పీరియడ్స్ సెలవు ప్రకటించింది. ప్రతి అమ్మాయి నెలలో ఏ సమయంలో అయితే  పీరియడ్స్ వస్తాయో అప్పుడు సెలవు తీసుకోవచ్చన్నమాట. ఇలా పీరియడ్స్ సెలవు ప్రకటించిన హిదయతుల్లా యూనివర్సిటీ పాలకవర్గంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

periods

హెచ్‌ఎల్‌యూ నిర్ణయంపై అక్కడ చదివే విద్యార్థులు, తల్లిదండ్రులే కాదు ప్రతి ఒక్కరూ  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎప్పటినుండో చదువుకునే అమ్మాయిలు, జాబ్ చేసే మహిళలు పీరియడ్ సమస్యతో బాధపడుతున్నారు... ఇంత కాలానికి వారి సమస్యను గుర్తించారని అంటున్నారు. కేవలం హెచ్‌ఎల్‌యూ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఈ పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలు చేస్తే బావుంటుందని అంటున్నారు.ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఇలాంటి వెసులబాటే వుంటే బావుంటుందని కోరుతున్నారు. 

periods

అమ్మాయిలకు పీరియడ్స్ సెలవుపై హిదయతుల్లా లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వివేకానందన్ మాట్లాడుతే...  విద్యార్థుల ప్రత్యేక సమయాల్లో పడే ఇబ్బందులను దూరం చేయడానికే సెలవు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇకపై తమ యూనివర్సిటీలో అమ్మాయిలు బాధపడే పరిస్థితి వుండదన్నారు. పీరియడ్స్ సమయంలో కాలేజీకి వచ్చినా అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టలేరు... కాబట్టి వారు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మంచిందన్నారు.  

periods

అయితే ప్రస్తుతం సాధారణ రోజుల్లో విద్యార్థినులు పిరియడ్స్ సెలవులు తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని... భవిష్యత్తులో పరీక్షల సమయంలో వారు పీరియడ్స్ తో బాధపడుతుంటే సెలవు తీసుకుని మరోరోజు  పరీక్ష రాసే వెసులుబాటు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కొందరు అమ్మాయిలకు హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ సమస్య ఒక్కరోజు కంటే ఎక్కువగా వుంటుందని...అలాంటివారికి  
సెమిస్టర్ లో ఆరు రోజులవరకు సెలవు తీసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.   
   

Latest Videos

click me!